తప్పు చేసినందుకు శిక్ష...
ఇద్దరు స్నేహితురాళ్లు చాలా కాలం తర్వాత కలుసుకున్నారు. ఒకరి కష్టాలు మరొకరు కలబోసుకుంటున్నారు.
ఆ సమయంలో ఉష తన స్నేహితురాలు లతను ఇలా అడిగింది - ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదనే, జీవితం ఎలా ఉంది.
ఏ మాత్రం తడుముకోకుండా - తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు కదా అని లత ఠకీమని జవాబిచ్చింది.
దాంతో ఉష నోరు వెళ్లబెట్టింది.
.... ... ....
మా అబ్బాయికి ఓ మంచి సంబంధం చూడవోయి అన్నాడు సుబ్బారావు తన మిత్రుడు కనకారావుని.
అమ్మాయి ఎలా ఉండాలని అడిగడు కనకారావు
ఇల్లు శుభ్రంగా ఊడ్చాలి. బట్టలు తెల్లగా ఉతకాలి. బాగా వంట చేసి పెట్టాలి - ఇలా లక్షణాలు చెప్పుకుంటూ పోతున్నాడు సుబ్బారావు
ఆలోచించాల్సిందేముందోయ్ సుబ్బారావు, మా పనమ్మాయికి ఆ లక్షణాలన్నీ ఉన్నాయి - చెప్పాడు కనకారావు












Click it and Unblock the Notifications