పని మనిషీ, వాషింగ్ మిషన్ కథ
పని మనిషి ఉతకాల్సిన బట్టలన్నింటినీ మూట కట్టడం ప్రారంభించింది. ఉతకాల్సిన బట్టలను మూడ కడుతుండడం చూసి యజమానురాలు ఆశ్చర్యపోతూ - బట్టలు మూట కడుతున్నావేమిటే అని అడిగింది.
ఇన్ని బట్టలు ఉతికితే నడుం వంగిపోతుందండి చెప్పింది పనిమనిషి.
ఉతక్క ఏం చేస్తావే అని అడిగింది యజమానురాలు.
ఇంటికి తీసుకెళ్లి వాషింగ్ మిషన్‌లో వేసి తీసుకొస్తా అమ్మగారూ అని చెప్పింది పని మనిషి
..... ......
ఒరే, రాజూ, స్టాండప్ గట్టిగా అరిచాడు టీచర్
ఒక్కసారి ఉలిక్కిపడి కళ్లు నులుముకోసాగాడు రాజు.
పాఠం చెబుతుంటే నిద్రపోతున్నావేమిట్రా అడిగాడు టీచర్
మీరు పాఠం చెబుతుంటే జోల పాడినట్లుంది, సార్. నిద్రవచ్చేస్తోంది చెప్పాడు రాజు
మిగతావాళ్లు ఎందుకు నిద్రపోవడం లేదు అన్నాడు టీచర్
వాళ్లు పాఠం వినడం లేదు సార్ చెప్పాడు రాజు












Click it and Unblock the Notifications