నేను చూల్లేదు, నా భార్య చూసింది..
ఓ దొంగ బ్యాంకులో దొంగతనం చేశాడు. అనంతరం ఓ బ్యాంకు ఉద్యోగిని ఇలా అడిగాడు...
దొంగ: నేను దొంగతనం చేస్తుండగా నీవు చూశావా?
ఉద్యోగి: అవును చూశాను.
వెంటనే ఆ దొంగ అతనిని పిస్టల్‌తో కాల్చి చంపేశాడు. ఆ తర్వాత మరో ఉద్యోగి వద్దకు వెళ్లి నేను దొంగతనం చేస్తుండగా చూశావా అని అడిగాడు
రెండో ఉద్యోగి: నేను చూడలేదు. కానీ, నా భార్య చూసింది.
..... ..... ......
ఆనంద్: ఎందుకురా ఒకే రకం పుస్తకాలు రెండు కొన్నావు?
వెంకట్: ఈ పుస్తకాన్ని కొంటే సగం మార్కులు చేతిలో ఉన్నట్లేనని రాసి ఉంది. అందుకే రెండు పుస్తకాలు ఒకే రకంవి కొంటున్నాను.
ఆనంద్: అందుకు రెండు పుస్తకాలు కొనడమెందుకు?
వెంకట్: ఒకటి కొంటే సగం మార్కులు చేతిలో ఉంటే రెండు కొంటే పూర్తి మార్కులు వస్తాయి కదా!












Click it and Unblock the Notifications