ఆమె వేయి ఎందుకు ఇచ్చింది...
ఓ ప్రముఖ సినీ తార రైల్వే స్టేషన్లో దిగింది. ఓ బిక్షగాడు ఆమె వెంట పడి.. "అక్కా.. అక్కా.. ఓ పది రూపాయలు దానం చేయి, అక్కా.." అని అడగసాగాడు.
ఆమె వేయి రూపాయలు తీసి అతని చేతిలో పెట్టింది.
ఆశ్చర్యపోయిన సెక్రటరీ "అన్ని డబ్బులు ఎందుకిచ్చార"ని అడిగాడు.
"మొదటి సారి ఓ మగవాడు నన్ను అక్కా అని పిలిచాడు, అందుకే" అని చెప్పింది ఆ తార.
....... .......... ........
ఓ శిష్యుడు సన్యాసి వద్దకు వచ్చాడు.
"గురూజీ... నా భార్య నన్ను నానా తిప్పలు పెడుతోంది. తప్పించుకోవడానికి ఏదైనా ఉపాయం చెప్పండి" అని అడిగాడు.
"నీకేమైనా తెలివి ఉందా.. అదే తెలిస్తే నేను సన్యాసిని ఎందుకు అవుతాను?!" అని అన్నాడు.












Click it and Unblock the Notifications