ఎందుకు జైలులో పెట్టారు, చెప్పండి!
సూర్యం బైక్‌పై జోరుగా, హుషారుగా వెళ్తున్నాడు. ఇంతలో ఓ రామచిలుక వచ్చి అతని ముఖానికి కొట్టుకుని మూర్ఛిల్లి పడిపోయింది.
రామచిలుకపై మోజుపడిన సూర్యం దాన్ని తీసుకుని వచ్చి పంజరంలో పెట్టాడు. మూర్ఛనుంచి తెప్పరిల్లి చుట్టూ చూసి రామచిలుక సూర్యాన్ని చూసి ఇలా అంది - "నేను గుద్దినోడు చచ్చిపోయాడా, ఏమిటి నన్ను తీసుకొచ్చి ఈ జైలులో పెట్టారు" అని అడిగింది
...... ......
హీరోయిన్ అవుట్ డోర్ షూటింగులో ఓ చోట కూర్చుని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తోంది. కెమెరామన్, దర్శకుడు కలిసి తర్వాతి సీన్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇంతలో ఆమె వద్దకు ఓ బిక్షగాడు వచ్చి - "అక్కా ఓ రూపాయి ధర్మం చేయమ్మా!" అని అడిగాడు.
ఆమె వెంటనే హ్యాండ్ బ్యాగులోంచి వేయి రూపాయల నోటు తీసి ఇచ్చింది.
దానికి నోరు వెళ్లబెట్టిన బిక్షగాడిని చూసి - "నా జీవితంలో మొదటిసారి అక్కా అని ఓ మగవాడి చేత పిలిపించుకున్నాను. అందుకే..." అంది












Click it and Unblock the Notifications