తండ్రి కోసం అడిగితే పక్కింటతను...
రాము ఓ రోజు గుడికి వచ్చి దేవుడ్ని ఇలా కోరుకుంటాడు.
రాము: దేవుడా.. మా టీచర్ బాగా తిడుతుంది. ఆమె నాలుక తెగిపోవాలి.
ఆమె నాలుక తెగిపోతుంది. మర్నాడు రాము గుడికి వస్తాడు.
రాము: దేవుడా... మా మ్యాథ్స్ టీచర్ బాగా కొడుతున్నాడు, అతని చేతులు విరిగిపోవాలి
అతని చేతులు విరిగిపోతాయి. మర్నాడు గుడికి వస్తాడు రాము
రాము: మా నాన్న బాగా విసిగిస్తున్నాడు.. అతను చచ్చిపోవాలి, దేవుడా...
రాము ఇంటికి వచ్చే సరికి డాడీ దినపత్రిక చదువుకుంటూ ఉల్లాసంగా ఉంటాడు.
"నీకు ఏమీ కాలేదా?" అని అడుగుతాడు రాము తండ్రిని.
"ఏం అలా అడుగుతున్నావు" అని ప్రశ్నించాడు తండ్రి.
"ఏం లేదు, ఊరికే... మమ్మీ ఏది?" అని అన్నాడు.
"పక్కింటి రావుగారు చనిపోయారు.. చూడడానికి వెళ్లింది" చెప్పాడు తండ్రి












Click it and Unblock the Notifications