వాడిన తర్వాత నమ్మకమట..
భార్య: ఏమండీ.. ఒక సందేహం, అడగనా..
భర్త: అడుగు...
భార్య: ప్రేమ పెళ్లికి, పెద్దలు కుదిర్చిన పెళ్లికి మధ్య తేడా ఏమిటీ..
భర్త: పెద్దలు కుదిర్చిన పెళ్లి అమ్మిన సరుకు మళ్లీ వాపసు ఇవ్వడానికి కుదరనటువంటిది. ప్రేమ పెళ్లి - సరుకును వాడిన తర్వాత విశ్వాసం కుదుర్చుకోవడంలాంటిది..
.......... ....... .........
సుబ్బారావు ఓ రోజు పార్టీకి వెళ్లాడు. పార్టీలో ఓ అందమైన అమ్మాయి కనిపించింది. దాంతో అతను ఆమె వైపు కళ్లార్పకుండా చూడసాగాడు.
అది గమనించిన అమ్మాయి అతని వద్దకు వచ్చింది..
"మీరు నాకో సాయం చేయగలరా?" అని అడిగింది అమ్మాయి.
"ఏమిటో చెప్పండి" అన్నాడు సుబ్బారావు
"నా ముఖం మీంచి ఒకటి తీసేయగలరా?" అని అడిగింది.
సుబ్బారావు తెగ సంతోషపడిపోయి "ఏమిటో చెప్పండి.. ఇలాగే తీసేస్తా" అన్నాడు.
"నీ కుక్క చూపులను..." అన్నది ఆమె












Click it and Unblock the Notifications