ఆమె బెడ్రూం ఫ్రిజ్‌లోనే చలికి....
నరగంలో అప్పారావు, సుబ్బారావు కలుసుకున్నారు. నువ్వెలా చనిపోయావంటే, నువ్వెలా చనిపోయావని అడుక్కుంటున్నారు.
అప్పారావు: బాగా చలివేసి నేను చనిపోయా.
సుబ్బారావు? అంత చలి వేసిందా..?
అప్పారావు: అవును, అంత తట్టుకోలేనంత చలి వేసింది. మరి, నువ్వెలా చనిపోయావు?
సుబ్బారావు: నా భార్య మీద అనుమానం వచ్చింది. ఓ రోజు ఊరికి వెళ్తున్నాను, పది రోజుల దాకా రానని చెప్పి వెళ్లిపోయా. తిరిగి అదే రోజు రాత్రి ఇంటికి వచ్చి చూసే సరికి పడగ్గదిలో ఒక్కతే పడుకుని ఉంది. అమాయకురాలైన నా భార్యను అనుమానించినందుకు తట్టుకోలేక కత్తితో పొడుచుకుని చనిపోయా.
అప్పారావు" ఎంత పనిచేశావు..? ఒక్కసారి మీ బెడ్రూంలని ఫ్రిజ్ తెరచి చూసి ఉంటే మనిద్దరం బతికి ఉండేవాళ్లం.
...... ...... ......
తన మీద వాలిన చిలుకను ముద్దు చేస్తూ భార్య భర్తతో - "ఇది కచ్చితంగా ఆడ చిలుకనే" అంది
"నీకెలా తెలుసు?" అడిగాడు భర్త
"అది మగాడివైన నీ మీద వాలకుండా, నా మీద వాలింది కదా..." అంది భార్య
"అంటే, నేను నీ స్నేహితురాలి మీద వాలినట్లా..." అని అనేసి నాలుక కరుచుకున్నాడు భర్త.












Click it and Unblock the Notifications