ఆమె అమ్మ అయితే, డాడీకీ లాటరీ..
స్టూడెంట్ రాము అల్లరికి లేడీ టీచర్‌కు ఒళ్లు మండిపోతోంది. చెప్పిన మాట వినడం లేదు. దీంతో ఆమె కోపంగా - "నేనే మీ అమ్మనైతే రెండు రోజుల్లో నిన్ను దారిలో పెట్టేదాన్ని" అని అంది.
దానికి అతను వెంటనే అందుకుని - "టీచర్.. భలే మాట చెప్పారు. నేను వెళ్లి మీకు లాటరీ తగిలిందని మా డాడీకి చెప్తా" అని అన్నాడు.
టీచర్ నోరు వెళ్లబెట్టింది.
........ ...... .....
ఇరువురి కుటుంబాల మధ్య గొడవ జరుగుతోంది.
తాను స్నానం చేస్తుంటే పక్కింటాయన చూశాడని గొడవ చేస్తోంది ఓ మహిళ
పక్కింటాయన భార్యకు కోపం వచ్చి "అయితే, ఏం చేస్తావు?" అడిగింది.
"ప్రతీకారం తీర్చుకుంటా.." అన్నది ఆమె
"ఎలా..?"
"అతను స్నానం చేస్తున్నప్పుడు నేను చూస్తా.. అంతే..."
"అదేంటే?" అని అడిగాడు భర్త నిస్సహాయంగా
"అంతకన్నా ఎక్కువే చేస్తా.. అతను స్నానం చేస్తుంటే నేను బాత్రూంలోకి జొరబడతా" అని చెప్పింది.












Click it and Unblock the Notifications