ఆమెకూ అతనికీ లింకేమిటి...
సుశీల భర్తకు ఫోన్ చేసింది..
అతను "ఏమిటి.. చెప్పు" అని అడిగాడు.
"నేనండీ... మీ సుశీలను..." చెప్పింది.
"విషయం ఏమిటో చెప్పు" అని అడిగాడు.
"ఎక్కడన్నారు?" అని అడిగింది.
"ఆఫీసులో.." చెప్పాడు.
"హమ్మయ్య రక్షించారు.. మన పని మనిషి కనిపించకుండా పోయింది, ఎటు వెళ్లిందో తెలియదు చెప్పింది" ఆమె.
"దానికి ఫోనెందుకు..?" అన్నాడతను
"మీరున్నారో.. లేదోనని..." చెప్పింది ఆమె.
........ ........ .....
"మా తరం అమ్మాయిలే వేరు.." అంది తల్లి
"ఏం?" అని అడిగింది కూతురు.
"నీ వయస్సులో మేం ఎలా సిగ్గుపడేవారిమో...!" అంది తల్లి.
"అంత సిగ్గుపడే పని ఏం చేశారమ్మా మీరు...?!" అని అడిగింది కూతురు.












Click it and Unblock the Notifications