ఆమెతో వెళ్లిపోయాడమో..
ఓ పార్టీలో ఓ మహిళ గట్టిగా వెయిటర్‌ను పిలిచి - "ఇంతకు ముందు మద్యం అందిస్తూ హడావిడి చేసిన ఆ అందమైన అమ్మాయి ఏమైంది?" అని అడిగింది.
"ఆమె ఏమైందో తెలియదు, మీకు మద్యం కోసం చూస్తున్నారా, మేడమ్?" అని అడిగాడు వెయిటర్
"కాదు, మా ఆయన కోసం చూస్తున్నా" అని చెప్పింది.
...... ....... ......
ఓ హీరో ఓ రోజు తాను నటించిన సినిమాకు భార్యను తీసుకుని వెళ్లాడు.
హీరో ఆ సినిమాలో హీరోయిన్‌తో శృంగార రసం ఒలకబోసే సీన్ వచ్చింది. వెంటనే భార్య - "నాతో ఎప్పుడూ ఇలా రోమాన్స్ చేయలేదు, ఆమెతో ఎందుకు చేశారు?" అని అడిగింది.
"ఆ రోమాన్స్ చేసినందుకు నాకు నలబై లక్షలు ఇచ్చారు మరి.." చెప్పాడు హీరో












Click it and Unblock the Notifications