సిగ్గు లేదా, అలా అడగడానికి...
ఓ పెద్ద పార్టీ నడుస్తోంది. అంతా సందడిగా ఉంది. తాగేవాళ్లు తాగుతున్నారు. తినేవాళ్లు తింటున్నారు. ముచ్చట్లు పెట్టేవాళ్లు ముచ్చట్లు పెడుతున్నారు. ఆ పార్టీకి ఓ బడా రాజకీయ నాయకుడి కుమారుడు కూడా వచ్చాడు.
ఓ రెండు పెగ్గులు వేసిన తర్వాత యువకుల గుంపు వద్దకు వెళ్లి తన గొప్పతనాన్ని చాటుకోవడానికి... "మా తండ్రి ఎవరో తెలుసా?" అని అడిగాడు.
గుంపులోని ఓ వ్యక్తి వెంటనే... "ఆ మాట అడగడానికి సిగ్గు లేదా.. ఇంత పెద్దవాడివయ్యావు నీకు నీ తండ్రి ఎవరో తెలియదా..?" అని అన్నాడు.
...... ........
ఓ కుర్రాడు ఇంటి బయట కూర్చుని పెద్దగా ఏడుస్తున్నాడు.
అటు వెళ్తున్న ఓ వ్యక్తి అతని వద్ద ఆగిపోయి - "ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగాడు.
"ఇంట్లో అమ్మానాన్నలు గొడవ పడుతున్నారు" అని చెప్పాడు కుర్రాడు.
"మీ నాన్న ఎవరు?" అని అడిగాడు ఆ వ్యక్తి.
"నా తండ్రి ఎవరనే విషయం మీదనే వాళ్లు గొడవ పడుతున్నారు?" అమాయకంగా చెప్పాడు కుర్రాడు.












Click it and Unblock the Notifications