హనుమంతుడ్ని వేడుకో, భక్తా..
ఓ అతి తెలివైన బెస్తవాడు నదిలో చేపలు పడుతున్నాడు. ఆ రోజంతా గడుస్తున్నా చేపలు పడలేదు. చీకటి పడబోతూండగా మాత్రం చిన్న చేప పిల్ల గాలానికి చిక్కింది. దాన్ని తీసేసి చేతిలో పట్టుకుని తీవ్రంగా ఆలోచించి మళ్లీ నదిలోకి విసిరేస్తూ....
"నువ్వు ఇవ్వాళ్టికి ఇంటికి ఫో...రేపు ప్రొద్దున్న మీ అమ్మా, నాన్నను కూడా తీసుకుని రా అన్నాడు సీరియస్ గా..."
----------------------
దంపతులు ఇద్దరూ కలిసి ఓ జాతరకి వెళ్లారు. అక్కడ భార్య తప్పిపోయింది.
భార్య కోసం పోలీసులుకు పిర్యాదు చేసాడు. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాడు. చివరకు రామాలయానికి వెళ్లి...కన్నీళ్లతో రాములవారిని ప్రార్ధించాడు.
"రామా..నా బార్య ఆచూకి చెప్పి, ఆమెను నా వద్దకు చేర్చు..." అని వేడుకున్నాడు.
భక్తుని ప్రార్ధనకు కరిగిపోయిన రాముడు ప్రత్యక్ష్యమై... "భక్తా...ఈ సందు చివర హనుమంతుడు గుడి ఉంది అక్కడకి వెళ్లు. ఆయనకు మొరపెట్టు. నాకు కూడా సహాయపడింది ఆయనే..." అని తరుణోపాయం సూచించాడాయన.












Click it and Unblock the Notifications