సీజనల్ లవర్

హరి, గిరి చేతుల్లో పుస్తకాలతో హాస్టల్ గది దాటారు.

ఆర్ట్స్ కాలేజీ వైపు నడవడం ప్రారంభించారు. మధ్య దారిలో బాలవ్యాకరణం ఏ మాత్రం అర్థం కావడం లేదురా అన్నాడు హరి.

ఎప్పుడూ చదువు గొడవమేమిటిరా చిరాకు పడ్డాడు గిరి. చదువు గురించి ఆలోచించేవాడు జీవితంలో కొన్ని మధుర క్షణాలను కోల్పోతాడు అని కూడా అన్నాడు.

చదవకపోతే ఎలారా అన్నాడు హరి బుద్ధిమంతుడిలా.

చదువు గతి ఇంతే, చదువుకున్నవాడికి సుఖం లేదంతే అని రాసుకుని మననం చేసుకో అన్నాడు గిరి వేళాకోలంగా.

ఆర్ట్స్ కాలేజీ బస్ స్టాప్ దాకా వచ్చారు ఇద్దరు మిత్రులు. హరి చేయి లాగాడు గిరి.

ఏమిట్రా అడిగాడు హరి

అదిగో, అటు చూడరా, అందమైన సుందరాంగి, నిలబడు అన్నాడు గిరి.

క్లాస్‌కు లేటవుతుంది, నడు అన్నాడు హరి

పోనీ పోనీ, పోతే పోనీ, క్లాస్‌లు, గ్లీస్‌లు... అమ్మాయిని వదిలి పెట్టి రావడం కష్టంరా అన్నాడు గిరి.

సరే నువ్వుండు, నేను వెళ్తా చెప్పాడు హరి.

ఒరే హరీ, నన్ను ఏకాకిని చేసి పోతావట్రా, రెండు నిమిషాలు ఆగరా వేడుకున్నాడు గిరి.

సరే, రెండే రెండు నిమిషాలు చెప్పాడు హరి

గిరి అమ్మాయి దగ్గరగా వెళ్లి కళ్లలోకి సూటిగా చూశాడు. ఆమె పట్టించుకున్నట్లు అనిపించలేదు. గిరికి కోపమొచ్చింది. ఇంతలో ఆరేళ్ల కుర్రాడు సార్... చేయి చాపాడు.

మీరు అందంగా ఉన్నారని ఆ బాబు చెప్పి రమ్మన్నాడని ఆ అమ్మాయికి చెప్పిరా, డబ్బులిస్తా అని ఆ కుర్రాడికి చెప్పాడు గిరి.

కుర్రాడు వెళ్లి ఆమెకు చెప్పాడు. ఆమె సన్నగా నవ్వింది. దీంతో గుండె పెరిగిపోయిన గిరి ఆ కుర్రాడి చేతిలో పది రూపాయల నోట్ పెట్టాడు

భయంగా ఉందిరా, పద అన్నాడు హరి.

భయమెందుకురా అని మెల్లగా అని అరవిరిసిన గులాబీలాగా లేదు ఆ నవ్వు అన్నాడు గిరి.

ఇంతలో బస్సు వచ్చింది. బస్సు ఎక్కేసి ఆ అమ్మాయి వెళ్లిపోయింది. మిత్రులిద్దరు కాలేజీ బాట పట్టారు.

ఆర్ట్స్ కాలేజీ మెట్లు ఎక్కుతుంటే మోడర్న్ డ్రెస్‌లో ఓ అమ్మాయి ఎదురైంది. సన్నగా నవ్వాడు గిరి ఆమె వైపు చూస్తూ..

చూడనట్లు దాటిపోయింది ఆ అమ్మాయి.

క్లాసులోకి వెళ్లారు. ప్రొఫెసర్ రాలేదు. అమ్మాయిల వెనక బెంచీలో కూర్చున్నారిద్దరు

హల్లో అన్నాడు గిరి - క్లాస్‌మెట్ రమతో..

రమ నవ్వింది.

మీరు ఈ రోజు చాలా అందంగా ఉన్నారండీ అన్నాడు గిరి.

థాంక్స్ అంది.

కాస్తా గడుగ్గాయి అని రమ స్నేహితురాలు వనజ - ఏమిటి కథ అని అడిగింది గిరిని చూసి..

ఏం లేదు అన్నాడు.

రమను ప్రేమిస్తున్నావట సూటిగా అడిగింది.

అవునండి అన్నాడు.

ఎంత మందిని ప్రేమిస్తావేమిటి అని అడిగింది.

రమను మాత్రం సీరియస్‌గా ప్రేమిస్తున్నానండి చెప్పాడు గిరి.

వనజ హరి వైపు తిరిగి - మీ వాడు ఎంత మందిని ప్రేమిస్తాడు అని అడిగింది.

మా వాడు సీజనల్ లవర్ లెండి అని చెప్పాడు హరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+