వేరే ఆవిడతో తిరిగితే ఆమెకు జెలసీ
రాము: ఏమిట్రా.. నువ్వు సీత ప్రేమించుకున్నారని, అందుకే కలిసి తిరుగుతున్నారని, రేపో మాపో పెళ్లి చేసుకుంటారని అనుకున్నాం.. మరి ఇప్పుడేమో నువ్వు రమతో తిరుగుతున్నావు.. సీత ఏమైంది..
సోము: సీతకు జెలసీ ఎక్కువరా... నేను రమతో తిరుగుతున్నానని ఆమె ఈర్ష్యపడుతోంది. అందుకే...
.......... ......... .......
కస్టమర్ వెయిటర్‌తో గొడవ పడుతుండడంతో కౌంటర్లో నుంచి హోటల్ యజమాని లేచి వచ్చి "ఏమిటి గొడవ?" అని అడిగాడు.
"గొడవ ఏందని మెల్లగా అడుగుతావేమయ్యా... చికెన్65 తెమ్మంటే మీ వాడు ఆరు ముక్కులు తెచ్చి పెట్టాడు. మిగతా ముక్కలేవంటే అంతేనంటాడు..." అన్నాడు కస్టమర్.












Click it and Unblock the Notifications