ఆయన అడుగుజాడల్లో నడిస్తే..
"మీ ఆయన అడుగుజాడల్లో నువ్వు నడవడం లేదని మీ అత్తగారు ఒక్కటే పోరు పెడుతున్నారు" చెప్పింది కొత్తగా పెళ్లయిన కూతురికి తల్లి.
"ఆయన అడుగుజాడల్లో నడవాలంటే రోజూ బార్‌కు, పేకాటకు వెళ్లాలి" చెప్పింది కూతురు విసురుగా.
........ ........ .....
"ఎందుకురా.. ఏడుస్తున్నావు?" అని అడిగింది తల్లి కొడుకుని.
"ఎవడో నన్ను కొట్టాడమ్మా.." చెప్పాడు కుమారుడు.
"నువ్వు అతన్ని గుర్తు పట్టగలవా.. వాడి సంగతేమిటో చూస్తా.." అంది తల్లి కోపంగా.
"వాడి ముక్కు కోసుకుపోయి ఉంటుంది.. రక్తం కారుతూ ఉంటుంది" చెప్పాడతను.












Click it and Unblock the Notifications