కష్టపెడితే కాదు, కష్టపడితే...
గురువు గారిని చాలా కాలం తర్వాత మాజీ శిష్యురాలు కలసింది..
"గురూజి... కష్టపెడితే ఏదైనా సాధించవచ్చు అన్న మీ మాట నిజం గురువుగారు.... మా ఆయన్ని కష్టపెట్టి బోలెడన్ని చీరలు, నగలు కొనుక్కున్నా" అని చెప్పింది
దానికి గురూజి.... "కష్టపడితే ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పా తల్లీ...కష్టపెడితే అని కాదు..... చెవులు రింగులు పెట్టుకోవటానికే కాదు, సరిగా వినటానికి కూడా ఉపయోగించు....." చిరాకు పడుతూ చెప్పాడు.
----
మీద బల్లి పడిందని, ఫలితం కనుక్కోవటానికి జ్యోతిష్కుని దగ్గరకు వెళ్ళాడు సుబ్బారావ్.
సుబ్బారావ్ ని చూడగానే జ్యోతిష్కుడు " ఏం సుబ్బారావ్ మీద బల్లి పడిందా?" అని అడిగాడు...
"అవును స్వామి మీకెలా తెలుసు ..." ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బారావ్.
"నీ మీద పడ్డ బల్లి ఇంతకుముందే వచ్చిందిలే భయంతో వణుకుతూ.... సుబ్బారావ్ మీద పడ్డా నాకేం కాదు కదా స్వామి అని అడగటానికి...." సుబ్బారావు తెల్ల మొహం వేసాడు












Click it and Unblock the Notifications