ఆమెకు కావాల్సింది భర్త కాదట..
తండ్రి: నీకు ఎటువంటి అబ్బాయి భర్తగా కావాలి.. వెతుకుతా..
కూతురు: బాగా పాడేవాడు.. మంచి డ్యాన్సర్ కూడా అయి ఉండాలి. ప్రతివారం మంచి సినిమా చూపించేవాడు, ప్రపంచాన్నంతా చూపించేవాడు కావాలి. నేను మాట్లాడమంటే మాట్లాడాలి, వద్దంటే మానుకోవాలి.
తండ్రి: అయితే నీకు కావాల్సింది మొగుడు కాదు, టెలివిజన్
....... ...... .......
గుడి బయట భర్త భార్యతో - "నువ్వు ఇక్కడే ఉండు, నేను దర్శనం చేసుకుని వస్తా" అని చెప్పాడు
"నేను కూడా దర్శనం చేసుకుంటా, నేను లోనికి వస్తా" అని చెప్పింది భార్య
"గుడి నియమాలు అందుకు అంగీకరించవు" అని చెప్పాడు.
"నన్ను గుడిలోకి రానివ్వని నియమాలేమిటి?" అని అడిగింది.
"దాని మీద ఏం రాసి ఉందో చూడు.. పేలుడు పదార్థాలను తీసుకుని రావద్దని హెచ్చరిక ఉంది.. చూడు.." అన్నాడు.












Click it and Unblock the Notifications