గయ్యాళి అత్త, గడుసు కోడలు
కొత్తగా వచ్చిన కోడలిని గయ్యాళి అత్త రాచి రంపాన పెడుతోంది. కోడలు కాస్తా గడుసుదే. అత్త ఆగడాలకు బెదరడం లేదు. ఏం చేయాలనే ఆలోచన మాత్రం కొనసాగిస్తూనే ఉన్నది.
ఓ రోజు అత్త కోడలితో - అమ్మాయ్.. తెల్లవారు జామునే లేచి మీ మామయ్యకు రాగి జావ, నాకు ఉప్మా, మీ ఆడపడుచుకు పూరీ, మీ ఆయనకు వడ చేసి పెట్టు. ఆ తర్వాత నీకు ఇష్టమైంది చేసుకో.. చెప్పింది అత్త.
సరే, అత్తయ్యా... నాకు వేరు కాపురం పెట్టడం ఇష్టం.. అలాగే చేస్తా చెప్పింది కోడలు
....... ...... .....
దంపతులు సుబ్బారావు, రమ డైనింగ్ టేబుల్‌పై కూర్చుని బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు.
సుబ్బారావు గిన్నెలోని ఉప్మాను చాలా వరకు తన ప్లేట్లో వేసుకున్నాడు.
అది చూసి రమ - నా మీద నీకు ప్రేమ తగ్గినట్లుంది. పెళ్లయిన కొత్తలో నాకు చాలా మిగిల్చి నువ్వు తక్కువగా తినేవాడివి.
సుబ్బారావు ముందూ వెనక ఆలోచించకుండా - పెళ్లయిన కొత్తలో నీకు వంట చేయడం రాకపోయేది. బాగుండేది కాదు. ఇప్పుడు వంట బాగా చేస్తున్నావు. అందుకే..












Click it and Unblock the Notifications