అలా రాసినందుకే మొక్కుకుందట...
కాలింగ్ బెల్ శబ్దం విని పనిమనిషి తలుపు తీసి ఎదురుగా నిలబడ్డ వ్యక్తితో..
పనిమనిషి: మీకేం కావాలి సార్?
వ్యక్తి: మీ యజమానితో పని ఉంది
పనిమనిషి: మీరు ఎవరో చెప్తారా?
వ్యక్తి: ఓ బిల్ ఉంది...
పనిమనిషి: ఓహ్...ఆయన నిన్న సాయింత్రమే ఊరు వెళ్లారు
వ్యక్తి: అయ్యో...అది నేను పే చేయాల్సింది..సర్లేండి
పనిమనిషి: ఇవాళ ఉదయమే ఆయన ఊరు నుంచి వచ్చేసారుగా..లోపలకి రండి...
అంటూ తలుపు తెరిచి లోపలకు తీసుకు వెళ్లి కూర్చో బెట్టింది.
------------
ఓ రాజకీయ నాయకుడు కూతురు రెండో తరగతి చదువుకుంటోంది
ఆమె ఓ రోజు ప్రొద్దున్నే దేముడికి దణ్ణం పెట్టుకుంటోంది.
అది చూసి సంతోషపడిన తండ్రి ఆ పిల్లను ఎత్తుకుని... "ఏం కోరుకున్నావమ్మా" అన్నాడు.
"నువ్వు ముఖ్యమంత్రివి అవ్వాలని కోరుకున్నాను" అంది
అది విని చాలా సంతోషపడిన ఆ నాయకుడు...ముద్దు పెట్టుకుని.. అక్కడ ఉన్న అందరి వంకా గర్వంగా చూసి... "అలా ఎందుకు చేసావమ్మా..నేను అంటే అంత ఇష్టమా?" అన్నాడు
"మరి ..మన ముఖ్యమంత్రి ఎవరు అని నిన్న సోషల్ పరీక్షలో ప్రశ్న అడిగారు...నాకు ఎవరో గుర్తు రాకపోవటంతో...నీ పేరు రాసేసాను..అందుకే ఇలా మొక్కుకుంటున్నాను" అంది.












Click it and Unblock the Notifications