మాట్లాడే గుర్రాన్ని చూద్దామని...
సార్...ఓ ఫైవ్ దౌజెండ్ ఉంటే అప్పివ్వండి..హైదరాబాద్ వెళ్లి రాగానే ఇచ్చేస్తాను.." అంటూ అడిగాడు అప్పారావు క్యాజువల్ గా...
"కష్టం" అన్నాడు ప్రక్కోడు
"పోనీ..పది రూపాయలు వడ్డీ తీసుకోండి.." అన్నాడు అప్పారావు ఊరిస్తూ..
"ఓకే...హైదరాబాద్ నుంచి ఎప్పుడొస్తావు" అన్నాడు...అడిగిన డబ్బు ఇస్తూ..
"వెళ్లినప్పుడు" అన్నాడు అప్పారావు ఆ డబ్బు తీసుకుని జేబులో పెట్టుకుని వెళ్లిపోతూ..
---------
భర్త కూర్చూని ప్రశాంతంగా పేపర్ చదువుకూంటూంటే భార్య అతని బట్టలు వాషింగ్ మిషన్ లో వేస్తోంది
ఆ సమయంలో అతని ప్యాంట్ జేబులో కాగితాన్ని చూపెడితూ.. సోనీ అని రాసి ఉంది .."ఎవరీమే?" అని అడిగింది అనుమానంగా చూస్తూ..
దానికి భర్త...నవ్వేసి... "అదా...నిన్న నేను గుర్రపు పందాలుకు వెళ్లాను కదా...నేను బెట్ కాసిన గుర్రం పేరు" అన్నాడు తేలిగ్గా...
మరో రెండు రోజుల తర్వాత...ఆమె హడావిడిగా ఎక్కడికో వెళ్లటం గమనించి... "ఏంటి డియర్...ఎక్కడికి ప్రయాణం..." అని అడిగాడు భర్త
"ఏమీలేదు..నీ గుర్రం ఇవాళ ఫోన్ చేసింది...మాట్లాడే గుర్రాన్ని చూద్దామని పోతున్నా.." అంది భార్య












Click it and Unblock the Notifications