అచ్చం లాగే ఉంది, కానీ..
సుబ్బారావు ఎంతకూ పెళ్లి కావడం లేదు. అందరూ ముదిరిపోయిన బెండకాయ అని ఆట పట్టిస్తున్నారు. బెండకాయ ముదిరితే పనికి రాదని వెక్కిరిస్తున్నారు కూడా..
బాధ తట్టుకోలేక ఓ రోజు ఓ మిత్రుడి వద్దకు సలహా కోసం అడిగాడు.
"నీకు నచ్చిన అమ్మాయే దొరకలేదా?" అని అడిగాడు మిత్రుడు.
"ఎందుకు దొరకలేదు... నాకు నచ్చిన ప్రతి అమ్మాయిలను ఇంటికి తీసుకుని వెళ్లి అమ్మానాన్నలకు చూపిస్తూ వచ్చాను. మా అమ్మకు ఏ అమ్మాయీ నచ్చడం లేదు. ఏం చేయాలో తోచడం లేదు" అన్నాడు సుబ్బారావు.
మిత్రుడు ఓ క్షణం అలోచించి - "ఐడియా" అన్నాడు.
"ఏమిటి?" అని అడిగాడు సుబ్బారావు.
"అచ్చం మీ అమ్మ మాదిరిగా ఉన్న అమ్మాయిని తీసుకుని వెళ్లు" చెప్పాడు మిత్రుడు.
ఆ తర్వాత చాలా కాలానికి సుబ్బారావును కలిశాడు మిత్రుడు.
"పెళ్లయిందా.. మీ అమ్మకు అమ్మాయి నచ్చిందా?" అని ఆసక్తిగా అడిగాడు మిత్రుడు.
సుబ్బారావుకు కోపం వచ్చింది- "పెళ్లయింది. మా అమ్మకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నా" అని చెప్పాడు.
"ఇక సమస్య ఏముంది?" అని అడిగాడు మిత్రుడు.
"మా నాన్నకు ఆ అమ్మాయి అంటే అసలు ఇష్టం లేదు.. ఊరికే గొడవ పడుతున్నాడు" చెప్పాడు సుబ్బారావు












Click it and Unblock the Notifications