లాయర్‌ను చేసినందుకు...
"మీ అబ్బాయికి లా డిగ్రీ వచ్చిందట కదా, ప్రాక్టీసు ఎలా ఉంది?" అడిగాడు మిత్రుడు సుబ్బారావు రామారావును.
"ఏం చెప్పమంటావు...." అన్నాడు రామారావు
"ఏమైందేమిటి.." అడిగాడు సుబ్బారావు
"లా పట్టా తెచ్చుకున్నాడో లేదో ఆస్తి పంచివ్వాలని కోరుతూ నా మీదనే కేసు వేశాడు" చెప్పాడు రామారావు నిట్టూరుస్తూ..
...... ..... ......
"భార్యాభర్తలకు మధ్య తగువులాట సహజమని, ఎవరో ఒకరు సర్దుకుపోవాలని మా ఆయనకు చెప్పింది మీరేనా? అంకుల్!" అడిగింది రమ సుబ్బారావును
"అవునమ్మా.. అప్పుడే కాపురం నిలబడుతుందని చెప్పా" గర్వంగా అన్నాడు సుబ్బారావు
"మా ఆయన సూట్‌కేసు సర్దుకుని వెళ్లిపోయారు" చెప్పింది రమ బాధగా.












Click it and Unblock the Notifications