మాట మీద ఎలా నిలబడతారు...
ఇద్దరు మిత్రుల మధ్య సంభాషణ సీరియస్ విషయం మీద జరుగుతోంది.
తన మిత్రుడు రాజేశ్వర రావు నుంచి రంగారావు ఓ హామీని పొందాడు. ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పడానికి రంగారావు - మాట మీద నిలబడాలి, మరి అన్నాడు.
మిత్రమా, ఎవరైనా కాళ్ల మీద నిలబడతారు గానీ మాట ఎలా నిలబడతారు, చెప్పు అని అడిగాడ రాజేశ్వర రావు
మిత్రుడి మాటకు రంగారావు ఆశ్చర్యపోయాడు
.... .....
రెండు రేషన్ కార్డులు సంపాదించానోయ్ అని చెప్పాడు కవి కనకారావు
ఒక్కటి సంపాదించడానికే తల మీది ప్రాణం తోకకు వస్తోంది. నువ్వు రెండు ఎలా సంపాదించావు అని అడిగాడు సుబ్బారావు అమాయకంగా.
ఒకటి నా అసలు పేరు మీద, మరోటి నా కలం పేరు మీద... ఎలా ఉంది - అన్నాడు కనకారావు ఉరఫ్ కనకశ్రీ.












Click it and Unblock the Notifications