పళ్లు బీరువాలో దాచేస్తా
ఇద్దరు పెద్దవాళ్లు పార్కులో కలుసుకున్నారు.. వారి మాటలు ఇలా సాగాయి
ఒకాయన.... "ఏమండి...నా కన్నా పెద్దవారు.. ఈ వయసులోనూ మీ పళ్లు స్ట్రాంగ్ గా ...ముత్యాల్లా మెరుస్తున్నాయి. ఏం జాగ్రత్తలు తీసుకున్నారేమిటి?" అన్నాడు కాస్తా అశ్చర్యంగా.
మరో పెద్దాయన "పెద్ద జాగ్రత్తలు ఏమీ లేవండీ.....ఇంటికెళ్లగానే... పళ్ల సెట్ బీరువాలో దాచేస్తాను" అని తేలిగ్గా చెప్పారు..
--------------------------------
చాలా కాలం తర్వాత కలుసుకున్న ఇద్దరు ప్రెండ్స్ ...ఓ బార్ లో ప్రశాంతంగా కూర్చుని కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నారు...
మొదటి వాడు.... "నాకూ, మా ఆవిడకు ఏదైనా గొడవయితే నేను వెంటనే మా ఇంట్లో బావిని చెక్కతో మూసి ఉంచుతాను" అన్నాడు.
రెండవావాడు..."ఏం.... మీ ఆవిడ కోపంతో నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుందని భయమా?"
మొదటి వాడు....."అదేం కాదు..... నన్ను తోసేస్తుందని భయం"












Click it and Unblock the Notifications