సినిమా తీస్తున్నారంటే చాలు...

"ఒక మంచి హర్రర్ సినిమా తీద్దామనుకుంటున్నా...." మీడియా సమావేశం లో చెప్పాడు దర్శకుడు...

"జనాలను భయపెట్టడానికి సినిమా తీయటం ఎందుకు సార్....మీరు సినిమా తీస్తున్నారు అని తెలిస్తే చాలు...జనాలు భయపడి చస్తారు.........." వెనక నుంచి ఎవరో అరిచారు

---
ఒకాయన ఇంటిమీదకు ఎప్పుడూ బంధుజనం వచ్చి పడుతుండేవారట. ఉన్నట్టుండి చుట్టాలు రావడం మానేసారట. ఎప్పుడూ గల గలలాడుతూ ఉండే ఇల్లు ప్రశాంతంగా వుండడం చూసి పక్కింటాయనకి ఆశ్చర్యమేసింది.

" ఏంటి సార్ ! ఈ మధ్య మీ చుట్టాల రాక తగ్గింది. కుక్క వున్నది జాగ్రత్త లాంటి బోర్డు ఏమైనా తగిలించారా ? " అని అడిగాడు.

దానికా ఇంటాయన " అబ్బే ! కుక్క వున్నది జాగ్రత్త అనికాదు.... 'కుక్కలకు ఆహ్వానం' అని బోర్డు తగిలించాను. అంతే ! ఒక్కడొస్తే ఒట్టు " అన్నాడు.

---------

మంత్రి గారి అబ్బాయి పాఠశాలలో తన తోటి పిల్లలను గిల్లి రక్కి కొట్టి ఏడిపిస్తున్నాడు.

బాధితుల తల్లిదండ్రులు ఈ విషయం ఫై మంత్రి గారికి చెప్పి , మీ అబ్బాయికి బుద్ది చెప్పమని కోరారు.

వెంటనే మంత్రి గారు కూల్ గా... " మీ సమస్యను వివరిస్తూ మొదట వినతి పత్రం సమర్ఫించండి" అన్నారు

దాంతో చిరాకు పడినా సమస్య పరిష్కారం కోసం ఆయనకు ఓ లెటర్ రూపకంగా రాసి సమస్యను వివరించారు.

ఆ తర్వాత మత్రిగారిని కలిస్తే... "తక్షణ కర్తవ్యంగా ముందు మా అబ్బాయి గోళ్ళు కత్తిరించి తరువాత బుద్ది చెప్పే విషయం లో ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటాను" అన్నారు.

ఆ వచ్చన వాళ్లు ఏం చెయ్యాలో అర్దం కాక బుర్ర గోక్కుంటా వెళ్లిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+