ఇక్కడ పోయడం వస్తుంది కదా....
నీ తరఫున వాదించడానికి లాయర్‌ను పెట్టుకుంటున్నావా అని అడిగాడు న్యాయమూర్తి దొంగతనం కేసులో ఓ సారయ్యను.
లేదండి అని చెప్పాడు సారయ్య.
ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు న్యాయమూర్తి.
నిజం ఒప్పుకోవాలని అనుకుంటున్నాను. నిజం అంగీకరించిన తర్వాత లాయర్ ఎందుకుండీ అన్నాడు సారయ్య.
.... .... ....
ఇక్కడ మూత్రం చేయరాదు అని రాసి ఉండడం చూసి చిన్నాకు ఆశ్చర్యం వేసింది.
ఎందుకు మూత్రం చేయరాదో తేల్చుకోవాలని అనుకున్నాడు.
వెళ్లి, గోడకు మూత్రం చేశాడు. అది చూసిన ఓ వ్యక్తి తలపై రెండేసి - అక్కడ ఏం రాసి ఉందో చూశావా అని అడిగాడు.
అది తేల్చుకోవడానికే నేను మూత్రం చేయాలని అనుకున్నా చెప్పాడు చిన్నా.
అంటే... అన్నాడు అతను
పోయడం రాదని రాశారు, కానీ పోయడానికి వచ్చింది కదా అన్నాడు చిన్నా అమాయకంగా ముఖం పెట్టి...












Click it and Unblock the Notifications