టీఎస్‌పీస్సీ గ్రూప్-4 పరీక్ష తేదీ ఖరారు, వివరాలు: దరఖాస్తుకు రేపే చివరి తేదీ
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) గ్రూప్-4 పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. జులై 1న ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారలు తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) గ్రూప్-4 పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. జులై 1న ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారలు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నాం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో 8,180 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గత డిసెంబర్ నెలలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికే దాదాపు 9 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తొలుత జనవరి 30తో దరఖాస్తు జనవరి 30తో దరఖాస్తులకు గడువు ముగియడంతో విద్యార్థుల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ఆఖరి గడువును ఫిబ్రవరి 3 వరకు పొడిగించింది టీఎస్‌పీఎస్సీ.
శుక్రవారంతో కొత్త గడువు ముగియనుండటంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో దరఖాస్తు సంఖ్య పది లక్షలకు చేరుకునే అవకాశం ఉంది.

తెలంగాణ గ్రూప్ 1 మెయిన్ పరీక్ష తేదీలు ఇవే:
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. జూన్ 5 నుంచి 12 వరకు మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. వీటిలో 11వ తేదీ ఆదివారం కావడంతో ఆరోజు పరీక్ష ఉండదని తెలిపింది. ఇటీవల వెల్లడించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల్లో మొత్తం 25,050 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు.
హైకోర్టు ఆదేశాలతో సమాంతర విధానంతో రిజర్వేషన్లు చేపట్టినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. మల్టీ జోన్, రిజర్వేషన్ ప్రకారం 1:50 ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేశారు. గ్రూప్-1 మెయిన్ పరీక్షలు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో జరుగుతాయని టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. జనరల్ ఇంగ్లిష్ పేపర్ మినహా మిగతా అన్ని పేపర్‌లకు అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో పరీక్ష రాసుకోవచ్చని తెలిపింది. కాగా, గత ఏడాది అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,86,051 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.
టీఎస్‌పీఎస్‌సీ షెడ్యూల్ ప్రకారం..
జూన్ 5న జనరల్ ఇంగ్లిష్ (అర్హత పరీక్ష),
జూన్ 6న జనరల్ ఎస్సే (పేపర్-1),
జూన్ 7న హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ (పేపర్-2),
జూన్ 8న ఇండియన్ సొసైటీ, కాన్‌స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ (పేపర్-3), జూన్ 9న ఎకానమీ అండ్ డెవలప్‌మెట్ (పేపర్-4),
జూన్ 10న సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్‌ప్రిటేషన్ (పేపర్-5), జూన్ 12న తెలంగాణ ఉద్యమం అండ్ రాష్ట్ర ఆవిర్భావం (పేపర్-6) అంశాలపై పరీక్షలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications