ఆవుపై వ్యాసం ఏమైంది...
"రవీ! ఆవుపై వ్యాసం రాసుకుని రమ్మన్నాను, ఏం చేశావు?" అడిగింది టీచర్
"లేదు, టీచర్!" చెప్పాడు గోముగా రవి
"ఎందుకు?"
"రాద్దామని లేచేసరికి ఆవును మా అయ్య తోలుకెళ్లాడు, టీచర్!" చెప్పాడు
..... .... ....
ఈసారి టీచర్ చాలా జాగ్రత్తగా పదాలు వాడింది
"బస్సు గురించి వ్యాసం రాసుకొచ్చావా, రవీ!" అడిగింది టీచర్
"రాశాను, టీచర్!" అంటూ రాసిన వ్యాసాన్ని టీచర్ ముందు పెట్టాడు.
ఆ వ్యాసం ఇలా సాగింది - "నేను బస్సు ఎక్కాను. కిటికీలోంచి బయటకు చూశాను. ఆవు గడ్డి మేస్తూ కనిపించింది. ఆవుకు నాలుగు కాళ్లుండును. ఓ తోక ఉండును. రెండు కొమ్ములు, రెండు చెవులు ఉండును..."
టీచర్‌కు కోపం వచ్చి - "ఏది రాయమన్నా ఆవు గురించే రాస్తావేమిట్రా?" అని కసురుకుంది.
"నేనేం చేయను, టీచర్. మా ఇంట్లో అవు ఒక్కటే ఉంది. మీరేమో మా ఇంట్లో లేనివాటి గురించి రాయమంటారు.." అన్నాడు రవి.












Click it and Unblock the Notifications