ఓటుకు ఇలా, పెళ్లికి అలానా..
సుబ్బారావుకు అనుకోని సందేహం వచ్చింది. ఆ సందేహం తీర్చుకోవడానికి తన మిత్రుడి వద్దకు వెళ్లాడు. వాళ్ల మధ్య సంభాషణ ఇలా సాగింది.
సుబ్బారావు: ఓటు వేయడానికి 18 ఏళ్లు నిర్ణయించి, పెళ్లి చేసుకోవడానికి 21 ఏళ్లు ఎందుకు పెట్టారు.
మిత్రుడు: దేశాన్ని సంభాళించడం సులభం... కానీ భార్యను సంభాళించడం సులభం కాదని...
...... ........ ....
ఓ రోజు అందరూ నిద్రపోతుండగా ఓ దొంగ ఇంట్లో చొరబడి వస్తువులన్నీ సర్దేసుకున్నాడు.. ఇంతలో ఓ పిల్లాడు లేచాడు. దొంగకు ఏం చేయాలో తోచలేదు..
వెంటనే పిల్లాడు ఇలా అన్నాడు.. "నా స్కూల్ బ్యాగ్ కూడా తీసుకుని వెళ్లు.. లేదంటే అరుస్తా.. అందరూ లేస్తారు.."












Click it and Unblock the Notifications