హీరోయిన్ ఇంటికి వెళ్తే...
తనకు మంచి చీరలు దొంగతనం చేసి తీసుకురావాలని ఓ దొంగను అతని భార్య కోరింది. చాలా రోజుల నుంచి నిర్లక్ష్యం చేస్తున్న ఓ దొంగ ఓ రోజు భార్యకు - ఈ రోజు నీ కోసమే కేటాయించా. నీకు మంచి చీరలు దొంగతనం చేసి తీసుకుని వస్తా అని చెప్పాడు.
సినీ తారల చీరలు నీకు తెచ్చిస్తా అని కూడా అతను చెప్పాడు
దానికి వెంటనే స్పందిస్తూ భార్య ఇలా అంది - క్యారెక్టర్ నటి ఇంటికి వెళ్లు. అక్కడైతే చీరలు దొరుకుతాయి. హీరోయిన్ ఇంటికి వెళ్తే పీలికలు మాత్రమే దొరుకుతాయి.
.... .....
అమ్మాయిలను పడేయడానికి తన శరీర దార్ఢ్యం సరిపోదని భావించి, సన్నగా బక్కపలుచగా ఉన్న ఓ యువకుడు జిమ్‌కి వెళ్లాడు.
నేను అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలి. ఏ యంత్రం వాడాలి అని అడిగాడు ఆ యువకుడు జిమ్ మాష్టారును
అందుకు జిమ్ మాస్టార్ టకీమని ఇలా చెప్పాడు - బయట ఉన్న ఎటియం యంత్రాన్ని వాడాలి












Click it and Unblock the Notifications