Budh gochar 2023: ఈ నెలలో ఈ రాశులవారికి బుధాదిత్య యోగం.. మీరున్నారా?
సెప్టెంబర్ నెలలో కొన్ని గ్రహాల కీలక కదలికల వల్ల అన్ని రాశి చక్రాల జాతకుల జీవితాల పైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా బుధుడు మరియు సూర్యుని కలయికతో ఈ నెలలో శుభ బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల ఆరు రాశుల వారి జాతకాలలో అదృష్ట లక్ష్మి తాండవిస్తుంది. ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి బుధాదిత్య యోగం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయి. వారు కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఊహించని ఆర్థిక లాభాలు ఈ నెలలో వారికి కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు.

బుధాదిత్య యోగం వల్ల ధనుస్సు రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ధనుస్సు రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాలలో లాభదాయకంగా ఉంటుంది.. ఈ నెలలో ఆధ్యాత్మిక సాధన వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు. వైవాహిక జీవితం సవ్యంగా సాగుతుంది. ఉద్యోగస్తులకు ఈ కాలం బాగా కలిసి వస్తుంది.
బుధాదిత్య యోగం వల్ల కర్కాటక రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ సమయంలో ఎటువంటి ప్రయత్నాలు చేసినా ఫలిస్తాయి. మెరుగైన ఆర్థిక స్థితితో పాటు ఆకస్మిక ఆర్థిక లాభాలు కర్కాటక రాశి వారికి కలుగుతాయి. బుధాదిత్య యోగం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతుంది.
బుధాదిత్య యోగం వల్ల వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారి జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. పెండింగ్ పనులు అన్ని పూర్తవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. చట్టపరమైన విషయాలు కూడా అనుకూలంగా పరిష్కరించబడతాయి.
బుధాదిత్య యోగం వల్ల తులా రాశి వారికి కలిసొస్తుంది. వర్తక వ్యాపారాలలో లాభదాయకంగా ఉంటుంది. కొత్త వెంచర్లు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు కొత్త ఆర్డర్లను పొందే అవకాశం ఉంది.ఈ కాలం తులా రాశి వారికి అనుకూలమైన కాలం.
మిధున రాశి వారికి బుధాదిత్య యోగం వల్ల బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరి ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. సంపద కోసం వారు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది. వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిలిచిపోయిన ప్రాజెక్టులు ఊపందుకోవటానికి అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications