15 రోజుల్లో 2 గ్రహణాలు.. ఈ రాశులవారికి చుక్కలే!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి నెల ఒక అసాధారణమైన నెల. ఈ నెలలో 15 రోజుల వ్యవధిలో రెండు ముఖ్యమైన గ్రహణాలు సంభవిస్తాయి. మార్చి 13వ తేదీన చంద్రగ్రహణం సంభవిస్తే మార్చి 29వ తేదీన సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఇక అదే రోజు శని మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ అరుదైన అమరిక దురదృష్ట యోగానికి కారణమవుతుంది. ఇది ముఖ్యంగా ఐదు రాశుల వారి పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.

మేషరాశి
మార్చి నెలలో ఏర్పడే రెండు గ్రహణాలు మేష రాశి వారి జీవితంలో ఊహించని మార్పులకు కారణం అవుతాయి. ఆర్థికంగా ఈ సమయం కష్టకాలంగా ఉంటుంది. ఆదాయాన్ని మించి ఖర్చు పెరిగిపోతుంది. అనవసరమైన ఖర్చులను నివారించడం ఉత్తమం. ఆరోగ్యపరంగాను కొంత అసౌకర్యంగా ఉంటుంది. కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. కాళ్లకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

2 eclipses in 15 days These zodiac signs are unlucky

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి మార్చి నెలలో ఏర్పడే రెండు గ్రహణాలు ఇబ్బందులను కలిగిస్తాయి. ఆర్థికంగా ఈ సమయం కష్టంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. స్టాక్ మార్కెట్లో నష్టాలు సంభవిస్తాయి. తరచూ ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. బంధువుల నుండి ఊహించని ప్రతికూల వార్తలు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారంలో ఉంటే నష్టాలు వస్తాయి.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి మార్చి నెలలో చాలా కష్టంగా ఉంటుంది. రెండు గ్రహణాల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది. డబ్బు లేకపోవడం వల్ల వ్యక్తిగత సంబంధాలలో చిరాకులు ఏర్పడతాయి. ఆరోగ్యపరంగాను ఇబ్బందికరంగా ఉంటుంది. నిరాశ, నిస్పృహలకు లోనవుతారు . శక్తి తక్కువగా ఉంటుంది.

ధనస్సు రాశి
ధనుస్సు రాశి వారికి గ్రహ ప్రభావాలు అడ్డంకులు సృష్టిస్తాయి. ఇవి కుటుంబ ఆరోగ్య, పని మరియు చట్ట వరమైన విషయాలను ప్రభావితం చేస్తాయి. వృత్తిపరమైన సవాళ్లను కలిగిస్తాయి. ఓర్పు మరియు స్వీయ క్రమశిక్షణ వాటిని అధిగమించడంలో మీకు సహాయపడతాయి. ధనుస్సు రాశి వారు గ్రహణాల సమయంలో ప్రతికూల ప్రభావాలను చూస్తారు. కాబట్టి జాగ్రత్త.

మీనరాశి
మీన రాశి వారికి మార్చి నెలలో ఏర్పడే గ్రహణాలు ఇబ్బంది కలిగిస్తాయి .మీరు ఈ సమయలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి బాగా పెరుగుతుంది. మానసిక ఆరోగ్యాన్ని నిర్వహించడం చాలా కీలకంగా మారుతుంది. తల్లిదండ్రుల, పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ దశ ప్రయోజనకరంగా ఉండదు. ఆర్థికంగా ఇబ్బందులను కలిగిస్తుంది. అప్పులు చేయకుండా ఉండడం మంచిది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+