2024 శుభయోగంతో ప్రారంభం: ఆనందం, ఆరోగ్యం కోసం ఈ పరిహారాలు చెయ్యండి!!

మరికొద్ది రోజుల్లోనే నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2024 సంవత్సరంలోకి ఎన్నో ఆశలతో వెళుతున్న మనకు 2024 కొత్త సంవత్సరం యాదృచ్ఛికంగా ఒక శుభయోగంతో ప్రారంభమవుతుంది. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అటువంటి ముఖ్యమైన విషయం. 2024 జనవరి ఒకటవ తేదీ సోమవారం శివుడికి అంకితం చేయబడింది. ఈ నూతన సంవత్సరం ప్రారంభం ఒక శుభయోగం వల్ల చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

నూతన సంవత్సరం ప్రారంభ రోజున ఎవరైతే శివుడిని ప్రసన్నం చేసుకునేలా అత్యంత భక్తి భావాన్ని ప్రదర్శిస్తారో వారికి ఆ పరమశివుడు ఆనందాన్ని, శ్రేయస్సును ఇస్తాడని, సంవత్సరమంతా శివుని ఆశీర్వాదాలు వారిపై ఉంటాయని చెబుతున్నారు. జనవరి 1 2024 వ తేదీన ఆయుష్మాన్ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

2024 Starts With Shubh ayushman Yoga: Do These Remedies For Happiness, Health!!

జనవరి ఒకటో తేదీన మధ్యాహ్నం 3:39 నిమిషాలకు ప్రారంభమై తేదీన 4: 34 నిమిషాలకు ఇది ముగుస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో ఆయుష్మాన్ యోగం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ యోగం యొక్క మంచి ప్రభావాలు ప్రజల జీవితంలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును, శాంతిని కలిగిస్తాయి. అయితే నూతన సంవత్సరం అన్ని రాశుల వారికి మెరుగైన ఫలితాలు కలగాలంటే శివుడికి కొన్ని పరిహారాలు చేయాలని చెబుతున్నారు.

జనవరి ఒకటవ తేదీన ఉదయాన్నే స్నానం చేసి సమీపంలోని శివాలయానికి వెళ్లి కుండలో నీటిని నింపి శివలింగానికి అభిషేకం చేస్తే శివుడి ఆశీర్వాదాలు ఉంటాయని చెబుతున్నారు. అంతేకాదు శివుడికి బిల్వపత్రాలు అంటే చాలా ఇష్టమని, జనవరి ఒకటవ తేదీన బిల్వ పత్రాన్ని సమర్పిస్తే, శివుడు సంతోషిస్తాడు అని, ఫలితంగా భక్తుల కోరికలు తీరుతాయని చెబుతున్నారు.

సంవత్సరం పొడుగునా శివుడి ఆశీర్వాదం కావాలనుకుంటే జనవరి ఒకటో తేదీన స్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించి, చందన తిలకాన్ని దిద్దుకోవాలని, ఆరోజు పేద ప్రజలకు విరాళాలు, తెల్లని వస్తువులు, తెల్లని పదార్థాలు, తెల్లని వస్త్రాలు దానం చేయాలని చెబుతున్నారు. కనుక శివుడి ఆశీర్వాదాలు కావాలనుకునే వారు ఈ పరిహారాలు పాటించాలి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+