2025లో వీరిపై షష్ఠ గ్రహ కూటమి ప్రభావం.. అయినా సుడి తిరుగుతుందన్న వేణు స్వామి!
2025 సంవత్సరంలో ద్వాదశ రాశులవారి జాతకాలను చెప్పారు ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు వేణు స్వామి. ఇందులో భాగంగా కన్యరాశి వారి జ్యోతిష్య అంచనా వివరించారు. ఉత్తర రెండు, మూడు, నాలుగు పాదములు, హస్త ఒకటి, రెండు, మూడు, నాలుగు పాదాలు, చిత్తా ఒకటి, రెండు పాదములు కన్యారాశి క్రిందకు వస్తాయి. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉంటుంది.
కన్యా రాశి వారిపై షష్ఠ గ్రహ కూటమి ప్రభావం
ఈ సంవత్సరం కన్యా రాశి వారికి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా 12 నెలలపాటు అనుకూలతలు ఉన్నప్పటికీ ఒక రెండు నెలల పాటు ఏప్రిల్, మేలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీనరాశిలో ఏర్పడేటువంటి షష్ఠగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ కన్యా రాశి మీద కూడా ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మన అనుకునే వాళ్ల వల్ల మోసగింపబడే అవకాశాలు ఉన్నాయి.

విద్యార్థులకు, ఉద్యోగులకు ఎలా ఉంటుందంటే
రక్తసంబంధీకుల వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది, తప్ప ఇంకా ఎటువంటి సమస్యలు కన్యరాశి జాతకులకు లేవు.
కన్యారాశి జాతకులకు సంబంధించి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. మార్కులు ఎక్కువగా వస్తాయి. ఉద్యోగం లభిస్తుంది. వివాహమవుతుంది. సంతాన యోగం కలుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి.అలాగే ప్రమోషన్లు ఉంటాయి. పై అధికారుల మన్ననల్ని పొందుతారు.
వ్యాపార వర్గాలకు అనుకూలమే
అలాగే మీకు రావాల్సిన లోన్లు వస్తాయి. ఒకవేళ లోను తీసుకుంటే తీర్చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు ఉంటాయి. వ్యాపారస్తులకు సంబంధించి, అన్ని వర్గాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి, కన్స్ట్రక్షన్ వారికి, మద్యం వ్యాపారులకు, కాంట్రాక్టర్ లకు, గోడౌన్స్ ఉన్నవారికి, అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతోంది .
రాజకీయ నాయకులకు 2025 ఇలా ఉండబోతుంది
రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతోంది. సమాజంలో కొద్దిపాటి చెడ్డ పేరు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరం గెలుపొందుతారు. అంటే ఈ సంవత్సరము రాబోతున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ గాని, ఎంపిటిసి ఎలక్షన్స్ గాని, జడ్పిటిసి ఎలక్షన్లో గాని కన్య రాశి వాళ్ళు పోటీ చేస్తే ఈ సంవత్సరం గెలుస్తారు.
కన్యా రాశి వారికి 2025 లో సక్సెస్ రేట్ ఎంతంటే
ఒకవేళ మీకు నమ్మకం లేకపోయినా అనుకోని విధంగా మీరు ఈ సంవత్సరం గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే క్రీడాకారులకు, కళాకారులకు ఈ సంవత్సరం అవార్డులు రివార్డులు ఉన్నాయి .మొత్తంగా కన్యా రాశి వారికి 2025లో 98% సక్సెస్ రేట్ ఉంటుంది. కచ్చితంగా ఈ సంవత్సరం కన్యారాశి వాళ్లకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయని వేణు స్వామి తెలిపారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications