గురుదేవుడి తిరోగమనం... ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే

జ్యోతిష్యంలో బృహస్పతిని దేవగురు అంటారు. ఆయన సంవత్సరానికి ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. అలా పుష్కర కాలం తర్వాత తన సొంత రాశి అయిన మీనంలోకి గురుడు ప్రవేశించాడు. 2024 మే వరకు అక్కడే ఉంటాడు. ఈ ఏడాది సెప్టెంబరులో గురుడు తిరోగమనం చేయబోతున్నాడు. ఈ వ్యతిరేక కదలిక 12 రాశులను ప్రభావితం చేస్తుంది. మూడు రాశులవారికి మాత్రం శుభ ఫలితాలను కల్పించబోతోంది. ఆ రాశుల వివరాలు తెలుసుకుందాం.

మేష రాశి
సెప్టెంబరు నెల నుంచి ఈ రాశులవారు ప్రయోజనాలను పొందుతారు. అదృష్టం ఎప్పుడూ వెంటే ఉంటుంది. గతంలో ప్రారంభించిన ఆగిపోయిన పనులన్నీ తిరిగి ప్రారంభమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుతారు. కొత్త ఉద్యోగానికి సంబంధించిన అన్వేషణ కూడా పూర్తవుతుంది. గతంలో అప్పుుగా ఇచ్చిన నగదు తిరిగివస్తుంది. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారస్తులు పెద్ద డీల్ కుదుర్చుకుంటారు. ఆధ్యాత్మిక పనులు, వాతావరణం పట్ల ఆసక్తి కలుగుతుంది.

 jodiac

మిథున రాశి
మిథునరాశివారికి ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. దీనివల్ల అనేక సమస్యల నుంచి బయటపడతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. జీవిత భాగస్వామి నుంచి ఊహించనిరీతిలో మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని వెచ్చిస్తారు. ఆనందం వెల్లివిరుస్తుంది. స్థిరచరాస్తుల ప్రాప్తం ఉంది.

కర్కాటక రాశి
ఈ రాశివారికి గురుడి తిరోగమనం వరంలాంటిదని చెప్పవచ్చు. కెరీర్ లో ఉన్నతస్థానాన్ని అలంకరిస్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ఎంతో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఇంక్రిమెంట్ తో కూడిన పదోన్నతి ఉంటుంది. వ్యాపారం విస్తరిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడంతోపాటు నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+