50 సంవత్సరాల తర్వాత శక్తివంతమైన నవ పంచమ రాజయోగం
గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి నిరంతరం మారుతుంటాయి. ఇలా మారినప్పుడల్లా మానవుల వ్యక్తిగత జీవితాలు కూడా ప్రభావితమవుతాయి. అన్ని గ్రహాలకన్నా చంద్రుడు అత్యంత వేగంగా తన స్థానాన్ని మారుస్తుంటాడు. ఒక్కో గ్రహాన్ని బట్టి ఇది మారుతుంటుంది.
గురుడు, కుజుడు కలిసి 50 సంవత్సరాల తర్వాత అరుదైన రాజయోగాన్ని ఏర్పరచబోతున్నారు. దీన్ని నవ పంచమ రాజయోగం అంటారు. దీనివల్ల నాలుగు రాశులవారికి అనేక ప్రయోజనాలు సిద్ధించనున్నాయి. ఏయే రాశులనేది తెలుసుకుందాం. అత్యంత శక్తివంతమైన రాజయోగాల్లో ఇది కూడా ఒకటి. నవ పంచం అనే పదానికి 9, 5 అని అర్థం. జ్యోతిష్య పండితులు దీన్ని అరుదైన కలయికగా చెబుతున్నారు.

మేష రాశి: ఈ రాశి వారికి అంగారకుడు(కుజుడు) అధిపతి. వీరికి శుభప్రదమైన ఫలితాలొస్తాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఆకస్మిక ధన లాభాలను పొందుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తో పదోన్నతి వస్తుంది. గతంలో ప్రారంభించి నిలిచిపోయిన పనులన్నింటినీ ఇప్పుడు పూర్తిచేస్తారు.
కర్కాటక రాశి: తెలివితేటలు, నైపుణ్యాలను పెంచుకుని కెరీర్‌ను చక్కగా మలచుకుంటారు. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు రావు. ఉద్యోగస్తులు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవుతారు. సైన్యం, పోలీసు, ఇంజనీరింగ్ రంగాల్లో ఉండే వారికి అనుకూలంగా ఉంటుంది.
సింహ రాశి: వ్యాపారస్తులకు మంచి లాభాలొస్తాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. ధైర్యం, పరాక్రమం పెరుగుతాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ ఈ సమయంలో పూర్తిచేస్తారు.
ధనస్సు రాశి: నవపంచమ రాజయోగం వీరికి అనుకూలంగా ఉంటుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. దూర ప్రయాణం చేస్తారు. రావాల్సిన బకాయిలను పొందుతారు. ప్రేమ జీవితంలో ఒకరినొకరు మంచి అనుబంధంతో వ్యవహరిస్తారు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళతారు.












Click it and Unblock the Notifications