కలలో ఇవి కనపడితే మీ పంట పండినట్టే, బంగారు గని దొరికినట్టే!
మానవ జీవితంలో కలల శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. చాలా కలలు భవిష్యత్తులో జరగబోయే అనేక ఘటనలకు సంకేతంగా నిలుస్తాయి. కొన్ని రకాల కలలు మీ అదృష్టం మారిపోతుంది అనే సంకేతాలను ఇచ్చే సూచనగా ఉంటాయి. ఇక ఎటువంటి కలలు మీకు అదృష్టాన్ని ఇస్తాయి? ఎలాంటి కలలతో మీ జీవితంలో సానుకూలమైన మార్పులు వస్తాయి? అనే అంశాలను ప్రస్తుతం తెలుసుకుందాం.
కలలో చీపురు
చాలామందికి కలలో చీపురు కనిపిస్తుంది కలలో చీపురు కనిపించడం అంటే త్వరలోనే మీ అదృష్టం మారిపోతుంది అనే శుభ సూచకం. సహజంగా చీపురు మన ఇళ్ళలో ఉన్న ప్రతికూలతలను తొలగించి శుభాలను తెస్తుందని చెప్తారు. మీకు సహాయం లభిస్తుంది అని, మీకు ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతున్నాయి అని చెప్పే సూచన.

కలలో గుడ్లగూబ
ఇక కలలో చాలామంది గుడ్లగూబని చూస్తారు. గుడ్లగూబ కలలోకి వస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉంటాయని చెప్పే సంకేతం. గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా చెబుతారు అటువంటి గుడ్లగూబ కలలోకి వస్తే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని సంకేతం. ఈ కల వస్తే త్వరలోనే ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.
కలలో స్వీట్లు, బంగారు, వెండి ఆభరణాలు
ఇక కలలో తెల్ల రంగులో ఉన్న స్వీట్లు చూడడం కూడా చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. తెల్ల రంగు ఉన్న తీపి వస్తువులు మీ జీవితంలో ఆనందం రాబోతుంది అని చెప్పడానికి సంకేతం. ఇక కలలో వెండి, బంగారు ఆభరణాలను చూడడం భవిష్యత్తులో మీరు సంపదను, విజయాలను, శ్రేయస్సును పొందుతారని చెప్పే సంకేతం. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అన్ని విధాల లబ్ధిని పొందుతారు.
కలలో ఖాళీ పాత్ర
ఇక కలలో ఖాళీ పాత్రను చూడడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని దీని అర్థం. ఇది ఆర్థిక లాభానికి సంకేతం. ఇలా వస్తే గతంలో మీరు పూర్తి కాకుండా వదిలేసిన పనిని త్వరలోనే పూర్తి చేస్తారు అని చెప్పే సంకేతం. మొత్తంగా కలలో కనిపించే ఈ వస్తువులు భవిష్యత్తులో మీకు అదృష్టాన్ని ఇస్తాయి అని చెప్పడానికి సంకేతంగా చెబుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
కర్కాటకరాశి వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారం.. అన్నింటా విజయం! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
వాస్తు ప్రకారం ఇంటి మెయిన్ డోర్ ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతుంది తెలుసా? -
ఇంటికి వాస్తు దోషాలుంటే రూపాయి ఖర్చు లేకుండా ఇలా చేయండి -
today rashiphalalu: నేడు బృహస్పతి, బుధుల స్థానాలలో మార్పు.. వీరికి జాక్ పాట్! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..












Click it and Unblock the Notifications