19ఏళ్ళ తర్వాత అరుదైన అధిక శ్రావణ మాసం: ఈ పనులు నిషేధం; చెయ్యొద్దు!!

ఆషాడ మాసం తర్వాత శ్రావణమాసం వస్తుంది. శ్రావణమాసం అనగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చేది పూజలు, వ్రతాలు, శుభకార్యాలు. శ్రావణ మాసానికి అంతటి ప్రాధాన్యత ఉంది. అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం అధిక శ్రావణ మాసం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది.

ఈ సంవత్సరం మాత్రం 19 సంవత్సరాల తర్వాత అత్యంత ప్రత్యేకమైన అధిక శ్రావణమాసం వచ్చింది. జ్యోతిష్య శాస్త్ర అంచనాల ప్రకారం శ్రావణుడు చివరిసారిగా 2004లో కనిపించాడు. మళ్లీ ఇప్పుడు 19 సంవత్సరాల తర్వాత సమకాలీకరణ జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం అధిక మాసానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది.

sravanamasam1

ఈ సంవత్సరం అధిక శ్రావణమాసం నేటి నుంచి మొదలై ఆగస్టు 16వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు నిజ శ్రావణమాసం ఉంటుంది. ఇక ఈ అధిక మాసాన్ని శూన్యమాసం అని అంటారు. శూన్యమాసంలో ఏ కొత్త పని చేయకూడదని, వివాహాది శుభకార్యాలు చేయకూడదని చెబుతారు. ఈ క్రమంలో మనం శూన్య మాసంలో నిషేధించిన కార్యకలాపాల జాబితాను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

శూన్య మాసంగా చెప్పబడే అధిక శ్రావణమాసంలో ఎవరూ ఆస్తిని అమ్మడం గాని, కొనడం గాని చేయకూడదు. ఆస్తులకు సంబంధించిన ముఖ్యమైన కార్యకలాపాలను ఈ మాసంలో చేయకుండా ఉండటమే మంచిదని సూచించబడింది. ఈ మాసంలో ఎవరు గుండు చేయించుకోకూడదు. ఈ మాసంలో పొరపాటున కూడా ఎటువంటి కొత్త కార్యాన్ని ప్రారంభించకూడదు.

అధిక శ్రావణమాసంలో పిల్లలకు చెవులు కుట్టించడం కూడా చేయకూడదు. ఇల్లు కట్టడం ఈ మాసంలో నిషిద్ధం. ఈ మాసంలో నిశ్చితార్థం చేసుకోవడం, వివాహం చేయడం వంటివి నిషేధమని చెబుతున్నారు. అధిక శ్రావణమాసంలో భూమి పూజలు, సీమంతాలు, ఉపనయనాలు, వ్యాపార సముదాయాల ప్రారంభోత్సవాలు, వాస్తు పూజలు వంటివి చేయకూడదని పండితులు చెబుతున్నారు.

పొరపాటున ఈ సమయంలో ఏదైనా మంచి పని చేయాలని ప్రారంభిస్తే, ఆ పనికి సంబంధించిన ఫలితం మాత్రం శూన్యం గానే మారుతుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అధిక శ్రావణమాసంలో పూర్వీకులకు సంబంధించి ఎటువంటి కార్యం చేసినా శుభం జరుగుతుందని, పితృదేవతలకు మనశ్శాంతి కలిగేలా కార్యక్రమాలను చేసుకోవచ్చని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+