5 శతాబ్దాల తర్వాత అరుదై పరిణామం.. ఈ రాశులు పట్టిందల్లా బంగారమే
గ్రహాల సంచారం అనేది రాశులకు మంచి ప్రయోజనాలను కల్పిస్తుంటుంది. తాజాగా గ్రహాల రాకుమారుడు బుధుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈనెల 29వ తేదీన అక్కడి నుంచి తులారాశిలోకి ప్రవేశిస్తాడు. అదే సమయానికి శనిదేవుడు మీన రాశిలో తిరోగమన పరిస్థితి నుంచి సాధారణ స్థితిలో సంచారం చేస్తాడు.
ఇలా శనిదేవుడు, బుధుడి గ్రహాల మార్గం సక్రమ మార్గంలో ఉండటంవల్ల అన్ని రాశులపై ప్రభావం ఉంటున్నప్పటికీ ప్రత్యేకంగా నాలుగు రాశులకు మాత్రం విశేషమైన ప్రయోజనాలను కల్పిస్తోంది. ఈ పరిణామం కూడా దాదాపు 500 సంవత్సరాల తర్వాత జరగబోతోంది. వాటి వివరాలను తెలుసుకుందాం.

మకర రాశి
అనుకోనిరీతిలో వీరికి లాభాలు వస్తాయి. నవంబరు నెలలో వీరికి ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో, సమాజంలో పేరు తెచ్చుకుంటారు. అయితే ఎదుటివారితో మాట్లాడే సమయంలో వివాదాలకు అవకాశం ఉంది. అలా రాకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా వీరిపై ఉంది. లేదంటే అప్పటివరకు ఉన్న మంచి పేరు పోగొట్టుకుంటారు.
మీన రాశి
అనుకున్న పనిని టార్గెట్ గా పెట్టుకొని, కష్టపడి పూర్తిచేస్తారు. అనుకున్న సమయానికి పూర్తిచేయగలిగే సామర్థ్యాన్ని సొంతం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు. భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోయి సంతోషంగా గడుపుతారు.
కుంభ రాశి
వీరు పెట్టే పెట్టుబడులు ఎంతో లాభదాయకంగా మారతాయి. కుటుంబంలోను, బయట కూడా చాలా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులకు వారి వారి కార్యాలయాల్లో మంచి పేరు రావడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. మంచి హోదాను అందుకుంటారు. ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు మంచి స్థితికి చేరుకుంటారు.
మిథున రాశి
కుటుంబ సభ్యులతో అధిక సమయం వెచ్చించేందుకే ఇష్టపడతారు. నవంబరు చివరి నుంచి వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయం పెంచుకోవడానికి ఊహించనిరీతిలో మార్గాలు దొరుకుతాయి. ఒకరకంగా వీరు ఎంత కష్టపడితే అంతకు రెట్టింపు ఫలితాలను పొందుతారు.












Click it and Unblock the Notifications