57ఏళ్ళ తర్వాత అరుదైన షష్ఠగ్రహ కూటమి... పులిపంజా చీల్చి కోటీశ్వరులయ్యే రాశులివే!

వేద జ్యోతిష శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది .అన్ని గ్రహాలు కాలానుగుణంగా నిర్దిష్ట సమయంలో తమ సంచారాలను చేస్తూ ఉంటాయి. గ్రహాలు సంచరించడం మాత్రమే కాకుండా వేరే గ్రహాలతో సంయోగం చెందుతూ అనేక శుభాశుభయోగాలను ఏర్పరుస్తూ ఉంటాయి. అయితే మార్చి 29వ తేదీన అరుదైన యాదృచ్ఛికం జరగబోతుంది. మీన రాశిలో ఆరు శక్తివంతమైన గ్రహాలు కలిసి ఒక ప్రత్యేక కలయికని ఏర్పరుస్తున్నాయి.

మీనరాశిలో ఆరు గ్రహాల కలయిక
ఇక రాహువు శుక్రుడు ఇప్పటికే మీనరాశిలో ఉండగా, ఫిబ్రవరిలో బుధుడు కూడా మీనరాశిలోకి చేరుతున్నాడు. ఆ తర్వాత మార్చి 14వ తేదీన సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక చంద్రుడు మార్చి 28న మీన రాశిలో సంచారం మొదలు పెడతాడు. ఇక మార్చి 29న శని మీన రాశిలోకి వెళ్తాడు.

A rare six-planet constellation after 57 years These zodiac signs are millionaires

షష్ఠ గ్రహ కూటమి కారణంగా మూడు రాశులకు అదృష్టం
57 సంవత్సరాల తర్వాత షష్ఠగ్రహ కూటమి కారణంగా కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు చేకూరుతున్నాయి . ఈ విధంగా మార్చి 29వ తేదీన మీనరాశిలో ఆరు గ్రహాలు కలయిక కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం రాబోతుంది. ఈ మూడు రాశుల వారు సంపన్న యోగాన్ని పొందబోతున్నారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మిధున రాశి
ఆరు గ్రహాల కలయిక కారణంగా మిధునరాశి వారికి మెరుగైన ఫలితాలు వస్తాయి. మిధున రాశి వారికి ఈ గ్రహాల కలయిక శుభప్రదంగా ఉంటుంది. మిధున రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగాలలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి ధన లాభం కలుగుతుంది. కష్టపడి పని చేసే వారికి ఆఫీసులో కూడా గుర్తింపు వస్తుంది.

కుంభరాశి
షష్ఠగ్రహ కూటమి కారణంగా కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. కుంభ రాశి వారు మీరు నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని, సృజనాత్మకతను కలిగి ఉంటారు. సొంత వెంచర్లను ప్రారంభించాలి అనుకుంటే కూడా ఇదే మంచి సమయం. కుంభ రాశి వారికి ఈ సమయంలో ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తే తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆరు గ్రహాలు కలయిక కారణంగా కుంభరాశి వారి జీవితాలలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి.

మకర రాశి
షష్ఠగ్రహ కూటమి కారణంగా మకర రాశి వారికి ప్రయోజనాలు చేకూరుతాయి. ఆరు గ్రహాల ప్రత్యేక కలయిక మకర రాశి వారికి విజయాన్ని అందిస్తుంది. పూర్తి మద్దతు పొందుతారు. పూర్తి ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు.అనేక కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి ప్రయాణాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. కొత్త వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. వారికి ఇది మంచి సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+