వాస్తు ప్రకారం ఇలా చేస్తే దీపావళి రోజు నుంచి సంపద వస్తుంది

వాస్తు అనేది మన భారతీయ పురాతన శాస్త్రం. ప్రపంచంలోని అన్ని దేశాలు నిర్మాణాలు చేసే సమయంలో వారికి అందుబాటులో ఉండే వాస్తు శాస్త్రాన్ని వాడతారు కానీ మన వాస్తు అతి ప్రాచీనమైంది. రుషులు మనకు దాన్ని అందించారు. కాబట్టి ఆ ప్రకారం నిర్మాణాలు చేసుకోవాలి. ఈెల 20వ తేదీన దీపావళి ఉంది. ఆ రోజు కొన్ని పనులను వాస్తు ప్రకారం చేస్తే సంపద రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొనాలంటే కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.

ఇంటిని అలంకరించుకోవాలి
దీపావళి పర్వదినం రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి చాలామంది పూజలు చేస్తుంటారు. అయితే వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆరోజు లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలగాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని చెప్పారు. ఇంటిని ఊడ్చి, కడిగి శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడా చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి. రంగురంగుల పూలతో అలంకరించుకోవాలి. ఆరోజు ఇంటిముందు దీపాలు పెట్టాలి. ఇలా చేయడంవల్ల తల్లి లక్ష్మి అనుగ్రహం కలిగి సంపద వస్తుంది.

According to Vastu wealth will come from Diwali with this tip

ఈశాన్యంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది
ఈశాన్యంలో దీపం వెలిగించాలి. ఆర్థికంగా కలిసిరావడానికి ఇది తోడ్పడుతుంది. వ్యాపారం కూడా బాగా కలిసివస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రం చేయాలి. ఇంటిని దీపాలతో అలంకరించడంవల్ల దీపావళి వెలుగులతో కళకళలాడుతుంది. అయితే చాలామంది ఒక దీపం వెలిగించి ఊరుకుంటారు. అలా చేయకూడదు. సాధ్యమైనంత వరకు, శక్తి మేరకు దీపాలు వెలిగించుకుంటే మంచిది. కనీసం రెండైనా వెలిగించాలి. ఈశాన్యంగా దీపం పెట్టడంవల్ల బాగా కలిసివస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆరోజు లక్ష్మీదేవి చిత్రపటాను, బంగారం, వెండి నాణాలను (లక్ష్మీదేవి) కొని ఉంచుకుంటే అదృష్టం కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+