12ఏళ్ళ తర్వాత జూన్ లో గురుఆదిత్య రాజయోగంతో ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టే రాశులివే!
జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో సంచారం చేస్తూ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాయి. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తున్న క్రమంలో వేరొక గ్రహంతో కలిసి కొన్ని యోగాలను ఏర్పరుస్తాయి. కొన్ని శుభ యోగాలు కాగా మరికొన్ని అశుభ యోగాలు. జూన్ మాసంలో మిధున రాశిలో గురువు, సూర్యుడు కలిసి గురు ఆదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తూ ఉన్నారు.
గురు ఆదిత్య రాజయోగం
ఈ గురు ఆదిత్య రాజయోగం కారణంగా కొన్ని రాశులవారు అదృష్ట జాతకులు అవుతున్నారు . 12 సంవత్సరాల తర్వాత జూన్ మాసంలో మిధునరాశిలో గురువు, సూర్యుడు కలయిక జరగబోతుంది. జూన్ 15వతేదీన సూర్యుడు మిధునరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక అప్పటికే మిధునరాశిలో ఉండే బృహస్పతితో సంయోగం చెందుతాడు. దీంతో గురు ఆదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కొన్ని రాశులవారి జీవితాలను మార్చేస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

సింహరాశి
గురు ఆదిత్య రాజయోగం సింహ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. జూన్ మాసంలో గురు ఆదిత్య రాజయోగం కారణంగా వీరు జీవితంలో సానుకూల ఫలితాలను చూస్తారు. ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు చేసేవారు పురోగతిని చూస్తారు. డబ్బు సంబంధిత విషయాలలో భారీ ప్రయోజనాలను పొందుతారు. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఏవైనా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
కన్యారాశి
గురు ఆదిత్య రాజయోగం కారణంగా కన్య రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. జూన్ మాసంలో దీనివల్ల కన్య రాశి జాతకుల కెరీర్ బాగుంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. విపరీతమైన ఆర్థిక లాభాలతో సంతోషంగా జీవిస్తారు. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరికి ఆస్తి యోగం ఉంది.
మీన రాశి
గురు ఆదిత్య రాజయోగం కారణంగా మీనరాశి జాతకులకు సంపన్న యోగం కలుగుతుంది. ఈ సమయంలో మీనరాశి జాతకులు ఏ పని చేసిన అదృష్టం వెన్నంటి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వారికి భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. డబ్బు సంపాదనకు నూతన మార్గాలు ఆవిష్కరించబడతాయి. వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications