18ఏళ్ళ తర్వాత కుంభరాశిలో గ్రహణ దోషం.. వీరిపై ఇనుపగజ్జెల తల్లి కన్నెర్ర!

వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. గ్రహాలు మరియు ఖగోళ వస్తువులు ఒక నిర్దిష్ట కాలం తర్వాత ద్వాదశ రాశులను, నక్షత్రాలను మార్చుకుంటూ సంచారం చేస్తుంటాయి. ఇవి కొన్ని రకాల శుభ యోగాలను, కొన్ని రకాల అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. వీటి ప్రభావం మానవ జీవితం పైన తప్పనిసరిగా పడుతుంది.

18ఏళ్ళ తర్వాత కుంభరాశిలో గ్రహణ దోషం
అందులో భాగంగా 2025 సంవత్సరంలో జూన్ 16వ తేదీన రాహువు మరియు చంద్రుడు కుంభరాశిలో సంయోగం చెందుతారు. దీని కారణంగా గ్రహణ దోషం ఏర్పడుతుంది. ఈ యోగం 18 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో ఏర్పడుతుంది. ఇది ఒక అశుభ యోగం దీని ప్రభావం అన్ని రాశుల వారి జీవితాల పైన పడుతుంది. ముఖ్యంగా మూడు రాశుల వారి జీవితాలలో గ్రహణ యోగం కారణంగా వ్యక్తిగత, వృత్తిపరమైన ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయి అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

After 18 years there is grahana dosha in Aquarius these zodiac signs will get difficulties

కర్కాటక రాశి
గ్రహణ దోషం కారణంగా కర్కాటక రాశి వారికి ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయి. ఇది కర్కాటక రాశి వారికి హాని కలిగిస్తుంది. కర్కాటక రాశిలో ఎనిమిదవ ఇంట్లో జరుగుతుంది. కాబట్టి ఈ కాలంలో మానసిక ఒత్తిడి ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ సమయంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఉత్తమ ఆరోగ్య దినచర్యను పాటించాలి. ఈ కాలంలో జాగ్రత్తగా వాహనాలు నడపాలి.

ఈ సమయంలో జాగ్రత్త
అన్ని రకాల ఖర్చులను నివారించాలి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. వివాదాలు లేకుండా చూసుకోవాలి. అనారోగ్య సమస్యలకు ఆస్కారం ఉంది, కాబట్టి జాగ్రత్త. జీవిత భాగస్వామితో వివాదాలకు దూరంగా ఉండాలి. మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉంది. సమస్యలను ప్రశాంతమైన మనసుతో పరిష్కరించుకోవాలి.

కుంభరాశి
గ్రహణ దోషం కారణంగా కుంభరాశి వారికి అశుభ ఫలితాలు వస్తాయి. ఈ దోషం మీ రాశి చక్రం నుండి లగ్న గ్రహంలో జరుగుతున్న కారణంగా కుటుంబంలోనూ, కార్యాలయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో కెరీర్లో సమస్యలు వస్తాయి. పనిచేసే చోట సీనియర్లు, సహ ఉద్యోగుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు.

డబ్బు విషయంలో జాగ్రత్త
ఎంత కష్టపడి పని చేసినా కూడా గుర్తింపు లభించదు. డబ్బుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. పొరపాటున డబ్బు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నష్టపోయే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలలో ఎదురు దెబ్బలు తినే ప్రమాదం కనిపిస్తుంది. కనుక పెట్టుబడులకు దూరంగా ఉండాలని సూచన. ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకుని పెట్టుబడులు పెట్టాలని సలహా.

మీనరాశి
మీనరాశి వారికి గ్రహణ దోషం కారణంగా హానికరమైన ఫలితాలు వస్తాయి. వీరి జాతకంలో 12వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీన రాశి వారు ఆర్థిక నష్టాలను అనుభవించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి.మీరు వ్యాపార ఒప్పందాలకు వెళితే తొందరపడి ఒప్పందాన్ని ఖరారు చేయకుండా ఉంటేనే మంచిది.

ఈ సమయంలో జాగ్రత్త
మీ మాటలను నియంత్రించుకోవడం చాలా అవసరం. కుటుంబం మరియు పనిలో ఘర్షణలను నివారించటం మంచిది. ఉద్యోగం చేసే చోట కూడా గొడవలకు ఆస్కారం ఉంది. నీపై తప్పుడు ఆరోపణలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏలినాటి శని ప్రభావం వారి పైన ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+