30 ఏళ్ల తర్వాత ఈ రాశులను అఖండ ధనయోగంతో శాసిస్తున్న శనిదేవుడు

నవగ్రహాల్లో అత్యంత కీలక గ్రహమైన శనిదేవుడు అంటే అందరూ భయపడతారు. కానీ ఆయన ఫలితాలనిస్తే వారి జీవితం మహారాజులా గడుస్తుంది. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మార్చే శనిదేవుడు 2025లో కూడా రాశిని మారుస్తున్నాడు. మార్చిలో హోలీ పండగ తర్వాత కుంభరాశి నుంచి బయటకు వచ్చి అదే నెల 29వ తేదీన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఇది జరుగుతోంది. దీనివల్ల ద్వాదశ రాశులపై ప్రభావం ఉన్నప్పటికీ కొన్ని రాశులవారు మాత్రం కోటీశ్వరులు కాబోతున్నారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

మిథున రాశి
శనిదేవుడు ఈ రాశివారి కర్మ స్థానంలో ఉండటంతో వీరికి అన్నివిధాలుగా కలిసిరాబోతోంది. ప్రధానంగా ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ ఉంది. ఆ ఉద్యోగం స్థిరపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. వ్యాపారస్తులు భారీ లాభార్జనతోపాటు కొత్త వ్యాపారం కోసం పెట్టుబడులు పెడతారు. ఇతరులతో మంచి ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు.

after 30 years Saturn enter pisces three zodiac signs will get huge and unexpected money

ధనుస్సు రాశి
శనిదేవుడు ఈ రాశివారి ఇంట్లో స్థిరత్వాన్ని కలిగిస్తాడు. అంతేకాకుండా ఆర్థికంగా బలవంతులను చేస్తాడు. భూమిని, భవనాన్ని కొనుగోలు చేయడంతోపాటు కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి చింత అవసరంలేదు. వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగేలా శనిదేవుడు చూస్తాడు. వీలైనంతవరకు శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం, శనిదేవుడికి తైలాభిషేకం చేయడం, పూజించడం చేస్తుండాలి.

మకర రాశి
ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంది. గతంలో ఇక రాదు అనుకొని నిలిచిపోయిన సొమ్ము చేతికి అందుతుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. వృత్తిలో ఉన్నవారికి మంచి ఎదుగుదల ఉండటతోపాటు బాగా కలిసివస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించి ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక వాతావరణం పట్ల మొగ్గు చూపుతారు. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+