54 ఏళ్ల మహా అద్భుతం... 7వ తేదీ నుంచి ఈ రాశులే మహర్జాతకులు
దేవతలకు సేనాధిపతి అయిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్టి ఈనెల ఏడోతేదీన రాబోతోంది. 54 సంవత్సరాల తర్వాత జరగబోతున్న మహా అద్భుతం ఇది. దీనివల్ల నాలుగు రాశులవారు కుబేరులు కాబోతున్నారు. సుబ్రమణ్యషష్టి వల్ల ఈ రాశులకు అత్యంత శుభ సమయం ప్రారంభమైంది. కెరీర్ పరంగా ఉన్నతస్థాయికి వెళ్లడమే కాకుండా ఆర్థికంగా స్థిరపడతారు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను పూర్తిచేసి విజయాలను అందుకుంటారు. డిసెంబరు ఏడోతేదీ నుంచి సుబ్రమణ్య షష్టి వల్ల కుబేరులు కాబోతున్న రాశుల వివరాలు తెలుసుకుందాం.
ధనస్సు రాశి
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. రాజకీయ నాయకులతో సంబంధాలు ఏర్పడతాయి. అవి లాభసాటిగా మారతాయి. కొత్త ఇంటిని కట్టుకోవాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు పెరుగుతాయి. సఖ్యత ఏర్పడి అందరూ ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా మంచి విజయాలను చేజిక్కించుకుంటారు.

మేష రాశి
పెండింగ్ పనులన్నీ పూర్తికావడానికి ఇది మంచి సమయం. విదేశాలకు వెళ్లాలనుకొని ప్రయత్నాలు చేస్తున్నవారికి కూడా ఇదే మంచి తరుణం. గతంలో రియల్ ఎస్టేట్ లో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు బాగా కలిసివస్తాయి. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. ఏ పని తలపెట్టినా జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేయడంవల్ల విజయవంతంగా పూర్తవుతుంది.
మీన రాశి
కెరీర్ పరంగా వీరికి తిరుగులేదు. దూసుకుపోతారని చెప్పొచ్చు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. తలపెట్టిన ప్రతి పనిలో విజయం అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహం కానివారికి వివాహం కుదురుతుంది.
కుంభ రాశి
ఈ రాశివారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. సమాజంలో వీరికి ఎనలేని గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించి విజేతలవుతారు. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. చిన్న చిన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. ఉపాధి అవకాశాలు నిరుద్యోగులకు పెరుగుతాయి.












Click it and Unblock the Notifications