64ఏళ్ళ తర్వాత శక్తివంతమైన త్రిగ్రాహి యోగంతో వీరికి అఖండ ధనయోగం!
గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మార్పు చెందుతూ ఉంటాయి. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి పైన సానుకూల లేదా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఇక గ్రహాల సంయోగం కారణంగా అనేక యోగాలు ఏర్పడతాయి. కొన్ని యోగాలు మనిషిని ఉచ్చ స్థితికి తీసుకువెళ్లగా, మరికొన్ని యోగాలు అనేక కష్టాలను కలిగిస్తాయి.
అరుదైన త్రిగ్రాహి యోగం
అయితే 64 సంవత్సరాల తర్వాత అక్టోబర్ 24 గురువారం నాడు అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. బుధుడు, శని, శుక్రుడు కలవడం వలన ఈ త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది . ఈ యోగం కారణంగా ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశుల వారు ఆర్థికంగా లాభాలను పొందుతారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి త్రిగ్రాహి యోగం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ యోగం కారణంగా కర్కాటక రాశి వారు నూతన గృహాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశం కూడా ఉంది. ఇక తండ్రి వైపు నుంచి వివాదాలలో ఉన్న ఆస్తుల సమస్యలు పరిష్కారమై అవి మీకు సొంతమవుతాయి. ఈ సమయంలో సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది.
కుంభరాశి
కుంభ రాశి జాతకులకు త్రిగ్రాహి యోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులు చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి. లాటరీ తగిలే అవకాశం ఉంది. కుంభరాశి జాతకులకు వివాహ యోగం కూడా కలగనుంది. ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఇది కుంభ రాశి జాతకులకు నిజంగా అదృష్టాన్ని ఇచ్చే సమయం.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు త్రిగ్రాహి యోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ యోగం కారణంగా ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలలోనూ, రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఉన్నవారు అధిక లాభాలను పొందుతారు. ఈ సమయంలో చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. విదేశాలకు వెళ్లే వారికి ఈ సమయంలో మంచి అవకాశాలు లభిస్తాయి. ఇది ఇది ధనుస్సు రాశి వారికి శుభాలను ఇచ్చే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications