అక్షయ తృతీయ రోజు ఈ తప్పులు చేస్తే దరిద్రం పట్టుకుంటుంది

అక్షయ తృతీయ హిందువులు విశేషంగా జరుపుకునే పండుగ . అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరు లక్ష్మీదేవిని నియమ నిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. మహాలక్ష్మి కటాక్షంతో సిరిసంపదలతో తులతూగాలని కోరుకుంటారు. సంపదలకు రక్షకుడిగా కుబేరుడిని నియమించిన రోజును అక్షయ తృతీయగా చెబుతారు. అంతేకాదు శ్రీ మహాలక్ష్మి శ్రీహరిని పరిణయమాడిన రోజుగా అక్షయ తృతీయకు విశేషమైన స్థానం ఉంది.

అక్షయ తృతీయ నాడు కొన్ని తప్పులు చేస్తే పేదరికం
అక్షయ తృతీయ ప్రతీ సంవత్సరం వైశాఖమాసంలోని శుక్లపక్షం తదియనాడు వస్తుంది. ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే 10వ తేదీన జరుపుకోనున్నాము. అక్షయ తృతీయ పండుగ రోజు మనకు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తే ఆ పొరపాట్లు మనకు పేదరికాన్ని తీసుకువస్తాయని, దరిద్రం వచ్చి పడుతుందని చెబుతారు. అందుకే అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని చెబుతున్నారు. అవేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Akshaya Tritiya 2024 Doing these mistakes on Akshaya Tritiya will lead to poverty

అక్షయ తృతీయ నాడు ఇవి తినకూడదు
అక్షయ తృతీయ శ్రీమహావిష్ణువుకు శ్రీమహాలక్ష్మికి ఇష్టమైన, చాలా పవిత్రమైన పండుగ రోజు కాబట్టి ఆరోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని భుజించకూడదు. మద్యం సేవించకూడదు. అక్షయ తృతీయ నాడు మద్యం సేవిస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఫలితంగా అనారోగ్యాల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. అక్షయ తృతీయ పండుగ నాడు పొరపాటున కూడా వెల్లి గడ్డలు, ఉల్లిగడ్డలతో వండిన ఆహారాన్ని తినకూడదు.

ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం
ఇంటిని మురికిగా ఉంచకూడదు. లక్ష్మీదేవికి ఇల్లు శుభ్రంగా ఉంటేనే ఇష్టం. మురికిగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీ ప్రవేశించదు.. కాబట్టి అక్షయ తృతీయ రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తా చెదారంతో ఇల్లు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలగదు. అక్షయ తృతీయ పర్వదినాన పొరపాటున కూడా శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన తులసి మొక్క ఆకులను తుంచకూడదు. అలా తుంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.

అక్షయ తృతీయ నాడు ఈ విషయాల్లో జాగ్రత్త
అక్షయ తృతీయ పండుగ రోజు ఎవరైతే నిష్టగా అమ్మవారిని పూజించాలి అనుకుంటారో వారు శరీరాన్ని, మనసుని శుభ్రంగా ఉంచుకోవాలి. మనసులో ఎవరిపైన కోపం, ద్వేషం, అసూయ వంటి భావాలను కలిగి ఉండకూడదు. అత్యంత భక్తి భావంతో చాలా పవిత్రంగా అమ్మవారికి పూజాదికాలు చేయాలి. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేసేవారు కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అయితే ఆ తప్పులు చేయకుండా జాగ్రత్తపడాలి.

తప్పులు చేయకుంటే అక్షయ పాత్ర.. తప్పులు చేస్తే దరిద్రం
బంగారాన్ని కొనుగోలు చేసిన వారు వెంటనే వాటిని అలంకరించుకోవడం తప్పు. బంగారాన్ని కొనుగోలు చేసిన వారు వాటిని పూజించిన తర్వాత పెద్దల చేతుల మీదుగా అలంకరించుకోవాలి. ఎలా పడితే అలా బంగారాన్ని పెట్టుకోకూడదు. ఈ నియమాలు అన్నింటిని పాటిస్తే అక్షయ తృతీయ మీకు సంపదలతో కూడిన అక్షయపాత్రను ఇస్తుంది. లేదంటే దరిద్రాన్ని తీసుకొస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+