అక్షయ తృతీయ 2025: అదృష్ట లక్ష్మి వరించే రాశులవారు వీరే!

2025 సంవత్సరంలో అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తేదీన బుధవారం నాడు వస్తుంది. వైశాఖ శుక్లపక్షంలో తృతీయ తిథిగా అక్షయ తృతీయ పరిగణించబడుతుంది. ఇక అక్షయ తృతీయ ను చాలా ప్రత్యేకంగా చూస్తాం. ఆరోజు బంగారాన్ని కొనుగోలు చేయడం చాలా మంచిదని భావిస్తారు. అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు.

అక్షయ తృతీయ అదృష్ట రాశులు
అక్షయ తృతీయ ఏప్రిల్ 29 సాయంత్రం ఐదు గంటల 31 నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ 30 మధ్యాహ్నం రెండు గంటల 12 నిమిషాలకు ముగుస్తుంది. ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 5 గంటల 41 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాల వరకు అక్షయ తృతీయ పూజ చేసుకోవచ్చు. ఇక అక్షయ తృతీయ సందర్భంగా కొన్ని రాశులు అదృష్ట రాశులుగా పరిగణించబడుతున్నాయి. మరి ఆ రాశులేమిటో తెలుసుకుందాం.

Akshaya Tritiya 2025 These are the zodiac signs that will receive the blessings of Goddess Lakshmi

మేషరాశి
మేష రాశి వారు అక్షయ తృతీయ రోజున కొత్త వస్తువులు కొనడం, దానాలు చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రాశి వారికి అక్షయ తృతీయ మేలు చేస్తుంది. సంపదలను ఇస్తుంది.

కర్కాటక రాశి
అక్షయ తృతీయ రోజున కర్కాటక రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు ఈ రోజున నూతన వ్యాపారాలను ప్రారంభిస్తే మంచిది. అంతేకాదు స్థిరాస్తులను కొనుగోలు చేస్తే కూడా మంచి జరుగుతుంది.

కన్యారాశి
అక్షయ తృతీయ నాడు కన్యారాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతున్నారు. అక్షయ తృతీయ నాడు ఈ రాశి వారు కొత్త సంబంధాలను ఏర్పరచుకోవచ్చు. వివాహానికి సంబంధించిన పనులను చేస్తే మంచి జరుగుతుంది.

తులారాశి
అక్షయ తృతీయ నాడు తులా రాశి జాతకులు అదృష్టవంతులుగా ఉంటారు . ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున తమ కెరీర్ ను మెరుగుపరుచుకోవడానికి నిర్ణయాలు తీసుకోవచ్చు. అంతేకాదు నూతన భాగస్వామ్య వ్యాపారాలు చేయడానికి కూడా ఇది మంచి సమయం.

మకర రాశి
మకర రాశి వారు అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఈ రాశి వారు కొత్త పెట్టుబడులు పెట్టడం లేదా కొత్త వస్తువులను కొనుగోలు చేయడం మంచిది. ఇక అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరు ఏదైనా శుభకార్యం చేసినా, దానధర్మాలు చేసిన మంచి ఫలితాలు పొందుతారని చెబుతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+