ఇంట్లో పెట్టేందుకు అన్ని అర్హతలు ఉన్న, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే మొక్క ఇదే!

వాస్తుశాస్త్రం ప్రకారం అయినా, ఆరోగ్య పరంగానైనా ఇంట్లో పెట్టుకోవటానికి అన్ని అర్హతలు ఉన్న మొక్క కలబంద. ఆరోగ్య విషయానికి వస్తే కలబంద మొక్క ఇంట్లో ఉంటె కలబందను మన ఆరోగ్య ప్రయోజనాలకు వినియోగిస్తే చాలా మంచిది. కలబంద గుజ్జుని మనం తీసుకోవటం వలన మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

కలబందతో ఆరోగ్యం
అంతేకాదు కలబందతో కాలిన గాయాలు, చర్మ ఇన్ఫెక్షన్‌లను నివారించవచ్చు. చర్మం మరియు జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. బరువును తగ్గించటంలో, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించటంలో కలబంద ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థను కాపాడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. మనకు అన్ని విధాలా ఆరోగ్యం ఇస్తుంది. మలబద్ధకం, కోలిక్ సమస్యలు, చర్మ పరిస్థితులు, కామెర్లు, ఇన్ఫెక్షన్లు నివారించటం కోసం కలబందను ఉపయోగిస్తారు.

Aloevera plant that gives health and wealth which has all the qualifications to keep at home

వాస్తు పరంగానూ కలబంద బెస్ట్
ఇక వాస్తు విషయానికి వస్తే ఇంట్లో కలబంద మొక్కను పెంచితే ఇంటికి శ్రేయస్సు కలుగుతుందని ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా, సానుకూల శక్తిని కలబంద పెంచుతుందని చెప్తారు. కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకోవడం అదృష్టమని, ఐశ్వర్యం వస్తుందని చెబుతారు. అయితే కలబంద మొక్కను పెట్టేటప్పుడు కొన్ని వాస్తు నియమాలను పాటించి పెట్టుకుంటే అది ఆ కుటుంబానికి అద్భుత ఫలితాలను ఇస్తుందని అంటున్నారు.

కలబంద ఇంట్లో ఉంటే అంతా మంచే
వాస్తు ప్రకారం ఇంట్లో కలబంద మొక్కలను నాటడం చాలా శుభప్రదం. కలబంద మొక్క నాటిన చోట ప్రేమ, శ్రేయస్సు, సంపద, ప్రతిష్ట పెరుగుతాయని చెప్తారు. కలబంద మొక్కను ఇంటికి తూర్పు వైపున, ఇంటికి ఆగ్నేయ భాగంలో కూడా నాటవచ్చు. మీకు ఉద్యోగంలో పురోగతి కావాలంటే కలబంద మొక్కను ఇంటికి పడమర వైపున నాటాలి.

కలబందతో పాజిటివ్ ఎనర్జీ
కలబంద మొక్కను పొరపాటున కూడా ఇంటికి వాయువ్య దిశలో నాటకూడదని గుర్తుంచుకోవాలి. కలబంద మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఇంటికి ఆగ్నేయ దిశలో కలబంద మొక్కను పెంచడం వల్ల డబ్బు, ప్రమోషన్ లభిస్తాయి. ఇంటి బాల్కనీలో, గార్డెన్ లో కలబంద మొక్కను పెట్టుకుంటే ప్రతికూలశక్తులు లోపలికి రాకుండా ఉంటాయి.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+